close
Choose your channels

‘‘ అంబటి రాసలీలలు, పావుగంట సుకన్య... అరగంట సంజన’’... టైటిల్ రిజిస్టర్ చేశాం: జనసేన నేత రియాజ్

Tuesday, April 26, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేతలు, మంత్రులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై జనసేన నేతలు విరుచుకుపడ్డారు.

ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ... అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలు చేసుకుంటే చలించిపోయి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సదుద్దేశంతో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారని ఆయన తెలిపారు. దీనిని వైసీపీ నాయకులు కనీసం అభినందించకపోగా అవాకులు చెవాకులు పేలడం దారుణమని మండిపడ్డారు. తమ అధినేతను వ్యక్తిగతంగా విమర్శించే మంత్రులు ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రియాజ్ జోస్యం చెప్పారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని స్థాపించబోయేది జనసేన పార్టీయే అని పవన్ చెప్పగానే... వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రియాజ్ మండిపడ్డారు. జనసేన జెండా చూస్తేనే ఫ్యాంటు తడిపేసుకునే పరిస్థితి నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో దాదాపు మూడు వేలమంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాగు నష్టాలు, ఆర్ధిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడితే అధికారంలో ఉన్న ఒక్క నాయకుడు కూడా వాళ్ల కుటుంబాన్ని పరామర్శించ లేదని రియాజ్ దుయ్యబట్టారు. అలాంటి కుటుంబాలను పరామర్శించి పవన్ రూ. లక్ష సాయం చేస్తుంటే వైసీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి నేనున్నాను అని చెప్పిన నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నాడని సెటైర్లు వేశారు.

జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై రియాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌పై సినిమా తీస్తాను అంటున్నాడని.. తమ అధినేత చరిత్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన తెలిపారు. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది అంబటి రాంబాబేనని ఆరోపించారు. అంబటి రాసలీలలు, పావుగంట సుకన్య... అరగంట సంజన టైటిల్స్ ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేశామని తెలిపారు. త్వరలోనే సినిమాలు కూడా తీస్తామని.. గతంలో ఆయన దగ్గర గన్‌మెన్‌గా చేసిన వ్యక్తి ఎందుకు ఆయన్ని కొట్టాడో ప్రజలకు వివరించాలని రియాజ్ డిమాండ్ చేశారు. ఏ నది మీద ఏ ప్రాజెక్ట్ కడుతున్నారో తెలియని నువ్వు జలవనరుల శాఖ మంత్రివా అంటూ సెటైర్లు వేశారు. కనీసం పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పే దమ్ము లేదని.. అలాంటి నువ్వు పవన్ గురించి మాట్లాడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. .

తమ అధినేత ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడితే... మంత్రి గుడివాడ అమర్ నాథ్ పవన్ పెళ్ళిళ్లు గురించి ప్రస్తావిస్తున్నాడని రియాజ్ ఫైర్ అయ్యారు. భర్తతో విడిపోయిన మహిళను ఇంకా భార్యగా సంభోదిస్తున్నారంటే... వీళ్లు ఎంత నీచమైన వ్యక్తులో ప్రజలకు అర్ధమవుతోందన్నారు. మంత్రిగా పనిచేసిన మీ తండ్రి ఏ వ్యాధితో చనిపోయారో లోకానికి చెప్పాలని రియాజ్ డిమాండ్ చేశారు. ఆయన హెచ్.ఐ.వి.తో చనిపోయారని ఉత్తరాంధ్రలో చెబుతారు.. నిజమేనా అంటూ సెటైర్లు వేశారు. మీ తండ్రి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే, మీ తల్లి టీడీపీకి సేవలు చేశారు... మీరు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి బానిస బతుకు బతుకుతున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ అంటే యువత, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీ పేరులో ఉన్న మూడు వర్గాలను ఈ మూడేళ్లలో రోడ్డున పడేశారని రియాజ్ దుయ్యబట్టారు.

అధికారంలోకి రాగానే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని... తీరా అరకొర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి యువతను మోసం చేశారని ఫైర్ అయ్యారు. కరెంటు కోతలతో పరిశ్రమలు మూతపడి శ్రామికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని.. మీ పాలనలో గిట్టుబాటు ధరలు లేక చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. గాజు గ్లాసు కనబడితే గుండె పగిలిపోతుందని ప్రజల్లో ఏడ్చిన వ్యక్తి అంబటి అని చెప్పారు. గెలవకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రజలను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అమర్ నాథ్ అని అలాంటి మీరు తమ అధినేత గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మరోసారి ఏ మంత్రి అయినా పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చెవాకులు పేలితే వాళ్ల ఇళ్లను ముట్టడిస్తామని రియాజ్ హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.