Pawan Kalyan:మళ్లీ ఏపీ విభజన అంటే నా అంత ఉగ్రవాది ఉండడు.. తోలు తీస్తా : పవన్ సంచలన వ్యాఖ్యలు


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేలోని వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీకి చెందిన కొందరు నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే మాట్లాడితే తన లాంటి తీవ్రవాదిని మరోసారి చూడలేరని పవన్ హెచ్చరించారు. ఇటీవల కొందరు నేతలు ఉత్తరాంధ్ర, రాయలసీమలను ప్రత్యేక రాష్ట్రాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
మీ బతుకులేంటో నాకు తెలుసు :
మీ బతుకులేంటో తనకు తెలుసునని, మీతో విసిగిపోయామంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ చదివారా.. పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రాన్ని విడగొడితే చూస్తూ కూర్చొంటామా అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను విడగొడతామంటే తోలు తీసి కింద కూర్చోబెడతామని ఆయన హెచ్చరించారు. రాయలసీమ నుంచి ఎంతో మంది సీఎంలు వచ్చారని, కానీ ఆ ప్రాంతానికి ఏం జరగలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థం కోసం ఇష్టారాజ్యగా స్టేట్మెంట్లు ఇవ్వొద్దని, రాష్ట్రాన్ని , ప్రజలను విడగొట్టింది చాలని ఆయన దుయ్యబట్టారు.
పోలీస్ అధికారిని జగన్ కొట్టాడు :
కోనసీమలో మంత్రి ఇల్లు తగులబడినా సీఎం వెళ్లలేదని , ఎందుకంటే వాళ్లు కావాలనే నిప్పు పెట్టించుకున్నారని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రికి ఏపీ పోలీసులపైనా, ఏపీ డాక్టర్లపైనా నమ్మకం వుండదని ఆయన దుయ్యబట్టారు. పోలీసులు రోజు సెల్యూట్ చేసే సీఎంకు వాళ్లంటే గౌరవం లేదని, ఆయన యువకుడిగా వున్నప్పుడు పులివెందులలో ఒక పోలీస్ అధికారిని జైలులో పెట్టి కొట్టిన ఘనత వుందని పవన్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి చేతిలో ఈరోజు లా అండ్ ఆర్డర్ వుందంటూ ఆయన చురకలు వేశారు. జనసేనను అధికారంలోకి తీసుకొస్తే తాను కూలీ మాదిరిగా పనిచేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ప్రజల అవసరాల కోసమే పొత్తులు పెట్టుకుంటున్నానని ఆయన తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.