close
Choose your channels

Janasena Party : ‘‘ముద్దుల మావయ్య’’నంటూ వంచన.. పిల్లలు చనిపోతున్నా పట్టదా : జగన్‌పై పవన్ ఆగ్రహం

Monday, July 4, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ లకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మీ మావయ్యనంటూ ముద్దులుపెట్టి మరీ పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో జగన్ వారిని నిలువునా ముంచారని ఆరోపించారు. విద్యార్థుల చదువు మధ్యలో ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్ములు ఇవ్వకుండా ఎందుకు దోబూచులాట ఆడుతున్నారు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. బాగా చదువుకోమని మాటలు చెబుతున్న మావయ్య చేతల్లో మాత్రం డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదంటూ జనసేనాని దుయ్యబట్టారు.

ఫీజు రీ ఎంటర్స్‌మెంట్ సొమ్ములు అందక పిల్లల ఆత్మహత్య:

మామయ్యను నమ్మి విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులు మధ్యలో ప్రభుత్వం ఉపకార వేతనం వేయకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను ఆ మావయ్య పట్టించుకోడా?’ అని పవన్ కల్యాణ్ నిలదీశారు. బీటెక్ చదువుతున్న తేజశ్రీ అనే విద్యార్థిని ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ సొమ్ములు ప్రభుత్వం వేయకపోవడంతో.. కళాశాల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటనకు ఈ ముద్దుల మామయ్య ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు.

స్పందన కార్యక్రమం విజయవంతమైతే.. ఈ అర్జీలేంటీ:

ప్రతి జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం విజయవంతం అయితే, మా వద్దకు అసలు సమస్యలు ఏవి రాకుండా ఉండాలి కదా అని పవన్ కల్యాణ్ నిలదీశారు. మొదటివారమే మొత్తం 427 మంది తమ సమస్యలను మా దృష్టికి తీసుకువచ్చారంటే అర్థం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో ఇది చెబుతున్నట్లే కదా అని పవన్ కల్యాణ్ అన్నారు. 427 అర్జీలతో వచ్చినవారు బాధలతో, సమస్యలతో సతమతం అవుతున్న లక్షల మందికి ప్రతినిధులని ఆయన అభివర్ణించారు. మన ప్రజాప్రతినిధులకు ప్రజా సమస్యలపై తప్ప అన్ని విషయాల్లోనూ తీరిక ఉంటుందని.. పుట్టిన రోజు సంబరాలకు, సదస్సులకు, బూతులు తిట్టడానికి వారికి చాలా సమయం ఉంటుందంటూ పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. మనం అంతా ఏకమై ఈ ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఓట్ల కోణంలో నేను చూడను:

ఒకరికి మేలు చేయాలన్నా, ఒక సమస్యను పరిష్కరించాలన్నా వైసీపీ నాయకులు ఎన్ని ఓట్లు పడతాయి..? మనకి లాభం ఎంత అని ఆలోచిస్తారని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. జనసేన మాత్రం ఒక సమస్యను పరిష్కరిస్తే ఎంత మందికి మంచి జరుగుతుంది అని మాత్రమే కొలమానంగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా ఒక సమస్య కోసం గళమెత్తితే ఆయా వర్గాల ఓట్లు ఎన్ని పోతాయో.. ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సమస్యను అందరి దృష్టికి తీసుకువెళ్లి దానిపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటే ఓట్ల రాజకీయాన్ని తాను ఆలోచించనని పవన్ పేర్కొన్నారు. కేవలం ప్రజలకు మేలు జరిగితే నాకు ఓట్లు వచ్చినా రాకపోయినా విజయం సాధించినట్లేనని ఆయన స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.