close
Choose your channels

జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లుకు పెద్దల సభ ఆమోదం

Monday, August 5, 2019 • తెలుగు Comments

జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సోమవారంనాడు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం రాజ్యసభలో జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. దీంతో, ఆర్టికల్ 370 రద్దు తీర్మానానికి రాజ్యసభ ఆమోదం లభించినట్టయింది. కాగా.. ఈ తీర్మానం బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు లభించగా, ఒకే ఒక్కరు మాత్రమే తటస్థంగా ఓటేశారు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ ఉండనుంది.

జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై పెద్దల సభలో మొదట డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టింది. బిల్లుపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరడంతో, అందుకు, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించి ఓటింగ్ చేపట్టారు. అయితే, సాంకేతిక కారణాలు తలెత్తడంతో ఆటోమేటిక్ ఓటింగ్ రికార్డింగ్ వ్యవస్థ పని చేయలేదు. దీంతో, స్లిప్పులతోనే ఓటింగ్ ప్రక్రియను చేపట్టారు. ఫైనల్‌గా ఈ బిల్లుకు అనుకూలంగానే ఎక్కువ ఓట్లు పడటంతో ఆమోదం లభించినట్లైంది. ఈ బిల్లు ఆమోదం అనంతరం రాజ్యసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.

మద్దతిచ్చిన, మద్దతివ్వని పార్టీలివే..

పునర్విభజన బిల్లుకు వైసీపీ, టీడీపీ, శివసేన, బీఎస్పీ, బీపీఎఫ్, అన్నాడీఎంకే, అసోం గణపరిషత్, ఆప్, శిరోమణి అకాళీదల్ మద్దతిచ్చాయి. కాగా కాంగ్రెస్, జేడీయూ, ఎస్పీ, సీపీఐ, టీఎంసీ. డీఎంకే, ఎండీఎంకే, పీడీపీ పార్టీలు వ్యతిరేకించాయి. కాగా.. ఎన్సీపీ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పట్నుంచి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా పరిగణించబడుతుంది. కాగా అసెంబ్లీలేని ప్రాంతంగా కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఉండనుంది. 

Get Breaking News Alerts From IndiaGlitz