close
Choose your channels

ISRO Aditya L1:అగ్రరాజ్యాలకు మరో సవాల్ విసిరిన ఇస్రో.. విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్ 1

Saturday, September 2, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చంద్రయాన్ 3 సక్సెస్‌తో ప్రస్తుతం ఇస్రో మంచి ఊపులో వుంది. దీనిలో భాగంగా సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం చేపట్టింది. శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహాన్ని తీసుకుని పీఎస్‌ఎల్‌వీ సీ 57 వాహకనౌక శనివారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రపంచ దేశాలన్నీ ఈ ప్రయోగాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. అత్యంత కచ్చితత్వంతో, ఇస్రో అంచనాలు తప్పకుండానే ప్రయోగం సాగుతోంది. రాకెట్ గమనాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతమైనట్లు తెలిపారు. ప్రయోగం విజయవంతమవ్వడానికి సహకరించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. నాలుగు నెలల పాటు ప్రయాణించి సూర్యుడికి సమీపంలోని ఎల్ 1 (లగ్రాంజ్) పాయింట్‌ను ఆదిత్య చేరుకోనుంది.

సూర్యుడిపైకి ఇండియా తొలి పరికరం:

భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతానికి భారత ఉపగ్రహాన్ని పంపడం ఇదే తొలిసారి. ఇక్కడి నుంచి చంద్ర, సూర్య గ్రహణాల సమయంలోనూ నిరంతరాయంగా సూర్యుడిపై పరిశోధనలు చేయవచ్చు. దీనికి అనుగుణంగా ఆదిత్య ఎల్ 1లో 7 పరిశోధన పరికరాలను అమర్చింది ఇస్రో. వీటి ద్వారా ప్రభాకరుడిని పొరలైన ఫోటో స్పియర్, క్రోమో స్పియర్ వెలుపల వుండే కరోనాను అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. సౌర జ్వాలలు, సౌర రేణువులు , అక్కడి వాతావరణం గురించి అధ్యయనం చేస్తాయి. తద్వారా భవిష్యత్తులో సౌర తుఫానుల నుంచి అంతరిక్షంలోని ఆస్తులను కాపాడుకోవడానికి వీలవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆదిత్య వెంట ఆరు అత్యాధునిక పరికరాలు:

ఆదిత్య ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లగా.. అందులోని విజిబుల్ ఎమినేషన్ లైన్ కరోనాగ్రాఫ్ రోజుకు 1440 చిత్రాలను పంపుతుంది. దీని బరువు 190 కిలోలు. వీటికి అదనంగా మరో అత్యాధునిక పరికాలను కూడా ఇస్రో పంపింది. సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, మ్యాగ్నెటోమీటర్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.