close
Choose your channels

జులై30న విడుద‌ల‌వుతున్న`ఇష్క్`

Wednesday, July 21, 2021 • తెలుగు Comments

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవ‌ల 'జాంబీ రెడ్డి' మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో 'ఇష్క్‌` చిత్రాన్ని నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే.. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌,ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై30న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం: తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz