close
Choose your channels

విజయ్ ‘మాస్టర్’ లుక్ కాపీ కొట్టేశారుగా!?

Monday, January 27, 2020 • తెలుగు Comments

విజయ్ ‘మాస్టర్’ లుక్ కాపీ కొట్టేశారుగా!?

ఇదిగో ఈ పక్కనుండే ఫొటోను కాస్త నిశితంగా గమనించండి.. రెండింట్లో ఏమైనా తేడా కనిపించిందా..? అస్సలు లేదుగా..? అచ్చు గుద్దినట్లు రెండూ సేమ్ టూ సేమ్ దింపేశారుగా..!. అదేనండి ఈ ఫొటొలోని పిక్ ఒకటి తెలుగు మూవీ ‘రాజుగారి గది-03’కి చెందినది. సేమ్ టూ సేమ్ అదే.. కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ ‘మాస్టర్’ మూవీకి లుక్‌ను దింపేశారు. ఈ రెండు ఫొటొలు ఒకే చోట చూసిన జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. వామ్మో ఇదేం కాపీ కొట్టడం రా బాబూ.. అచ్చుగుద్దినట్లుగా దింపేసి లేడీ స్థానంలో మగ మనిషి వచ్చారంతే.. మిగతాదంతా సేమ్ టూ సేమ్.!

దింపేశారుగా!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ మూవీ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పిక్‌ను చూడగానే జనాలు అంతా.. అబ్బే ఎక్కడో తేడా కొడుతోందే.. బాగా చూసినట్లే ఉందే.. అని కాస్త గూగుల్ సెర్చ్ చేసి చూడగా.. ఓంకార్‌ దర్శకత్వంలో అశ్విన్‌బాబు, అవికా గోర్‌ జంటగా వచ్చిన ‘రాజుగారి గది-03’ మూవీ లుక్ అందరికీ గుర్తొచ్చింది. ఈ రెండు లుక్స్‌ మిక్స్ చేసిన ఫొటోను నెట్టింట్లో పలువురు సినీ ప్రియులు షేర్ చేస్తూ సెటైర్లు, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఈ కాపీ లుక్‌పై కనకరాజ్, ఓంకార్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

రియాక్షన్ ఉంటుందా!
ఇదిలా ఉంటే.. ‘మాస్టర్’ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా.. విజయ్ సరసన మాళవిక మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఆండ్రియా, శాంత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విజయ్.. ‘మాస్టర్’లో ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఒకరు ‘మాస్టర్’.. ఇంకొకరు స్టూడెంట్ లీడర్‌గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి రెండు లుక్స్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా రిలీజ్ చేసిన లుక్‌పై మాత్రం సెటైర్లు ఓ రేంజ్‌లో వస్తున్నాయ్..!. ఫైనల్‌గా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో మరి.

Get Breaking News Alerts From IndiaGlitz