close
Choose your channels

ప్ర‌భాస్ 22.. బాలీవుడ్‌లోనేనా?

Saturday, July 4, 2020 • తెలుగు Comments

ప్ర‌భాస్ 22.. బాలీవుడ్‌లోనేనా?

‘బాహుబ‌లి’ రెండు పార్టులు విడుద‌లైన త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ఈ హీరో నేష‌న‌ల్ రేంజ్‌లో మార్కెట్‌ను పెంచుకున్నాడు. అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నాడు. ‘బాహుబ‌లి’ త‌ర్వాత వ‌చ్చిన ‘సాహో’ ద‌క్షిణాదిన రాణించ‌క‌పోయినా.. ఉత్త‌రాదిన మాత్రం బాగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అంటే ఉత్త‌రాదిన ప్ర‌భాస్‌కు బాగానే క్రేజ్ ఉంద‌నే విష‌యం మేక‌ర్స్‌కు అర్థ‌మైంది. దీంతో బాలీవుడ్ నిర్మాతలు కూడా ప్రభాస్‌తో సినిమా చేయ‌డానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

ప్ర‌స్తుతం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ప్ర‌భాస్ 20వ చిత్రం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఇది పూర్తి కాగానే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ 21 సినిమా తెర‌కెక్క‌నుంది. దీని త‌ర్వాత ప్ర‌భాస్‌ మ‌రో సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మా‌చారం. టీ సిరీస్ సంస్థ ప్ర‌భాస్‌తో సినిమా చేయాల‌నుకుంటుంద‌ట‌. తానాజీ సినిమా ద‌ర్శ‌కుడు ఓం రావ‌త్ ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం ఉందని టాక్‌. ఇందులో నిజానిజాలు తెలియాలంటే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz