close
Choose your channels

BiggBoss: త్యాగం చేసి ఫూల్ అయిన రోహిత్, ఒకే లాలీపాప్‌తో ఇనయా- సూర్య రాసలీలలు

Friday, October 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం బిగ్‌బాస్‌లో సర్‌ప్రైజ్ టాస్క్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులు తమ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీహాన్, సుదీప, ఆదిరెడ్డి, గీతూ, ఇనయా, అర్జున్, శ్రీసత్య, బాలాదిత్య, ఫైమా, రేవంత్‌లకు సర్‌ప్రైజ్ టాస్క్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇంకా.. కీర్తి, మెరీనా, రోహిత్, రాజ్‌శేఖర్, వాసంతి, ఆర్జే సూర్యలకు ఇంకా అవకాశం రాలేదు. దీంతో వారు తమకు అవకాశం దక్కుతుందో లేదోనని ఆందోళనగా కనిపించారు. మరి వీరికి ఎలాంటి సర్‌ప్రైజ్‌లు అందాయో లేదో చూస్తే.. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ షాకిచ్చాడు. బ్యాటరీ సున్నా శాతానికి పడిపోవడంతో దానిని తిరిగి వంద శాతం నింపేందుకు ఓ కఠినమైన కండీషన్ పెట్టాడు. రోహిత్, వాసంతిలలో ఎవరో ఒకరు వచ్చే రెండు వారాలకు నామినేట్ అవ్వాలి. ఇద్దరు చర్చించుకున్న అనంతరం.. రోహిత్ త్యాగం చేసి నామినేట్ అయ్యేందుకు ఒప్పుకున్నాడు. దీంతో బ్యాటరీ వందశాతం రీచార్జ్ అయ్యింది.

రీచార్జ్ అయిన వెంటనే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారో వారికి సర్‌ప్రైజ్ వుంటుందని చెప్పారు బిగ్‌బాస్. దీంతో ఎవరు వెళ్లాలన్న దానిపై వాసంతి , ఫైమా, సూర్య, కీర్తి, రాజశేఖర్ చర్చించుకున్నారు. కానీ వాసంతి కోసం నామినేట్ అయిన రోహిత్‌ను , అతని భార్య మెరీనాను మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడంతో రోహిత్ బాగా ఫీలయ్యాడు. మీ కోసం నేను నామినేట్ అయ్యేందుకు ఒప్పుకుంటే కనీసం ఒక్కరు కూడా ఫోన్ దగ్గరకు వెళ్తావా అని మమ్మల్ని అడగలేదంటూ బాధపడ్డాడు.

ఇదిలావుండగా.... రీచార్జ్ అయిన తర్వాత ఫస్ట్ కాల్‌ని రేవంత్ లిఫ్ట్ చేశాడు. అతనికి రెండు ఆప్షన్లు ఇచ్చాడు బిగ్‌బాస్. మీ భార్య సీమంతానికి మీరు పంపిన వస్తువులు ఆమెకు చేరాయో లేదో చూడాలనుకుంటున్నారా..? మీ భార్య ఫోటో కావాలనుకుంటున్నారా..?? చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యుల కోసం ఆలోచించి కేవలం పది శాతం బ్యాటరీ ఖర్చు చేసేలా భార్య ఫోటో ఎంచుకున్నాడు. తర్వాత వరుసగా ఫైమా అమ్మతో వీడియో కాల్ కాల్ మాట్లాడగా.. కీర్తి మానస్ వీడియో అందుకుంది. సూర్య... అమ్మ పంపిన ఉత్తరాన్ని తీసుకుని చదివాడు. వాసంతి కృష్ణన్ తన అక్క కూతురి ఫోటో తీసుకుంది. రాజ్ అమ్మతో ఆడియో కాల్ అందుకున్నాడు. అలా వీరందరూ రీచార్జ్ మొత్తం వాడుకోవడంతో మెరీనా, రోహిత్‌లకు ఎలాంటి అవకాశం దక్కలేదు.

అనంతరం కెప్టెన్సీ కంటెండర్స్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా ఎనిమిది బంతులు ఇచ్చి వాటిని ఎవరైతే తమ పేరున్న బాస్కెట్‌లో మొదటగా వేస్తారో.. ఆ ఎనిమిది మంది కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని చెప్పాడు. ముందుగా ఆదిరెడ్డి, రేవంత్, రాజశేఖర్‌, శ్రీసత్య, సూర్య, అర్జున్, వాసంతిలు బంతులను దక్కించుకుని తమ బుట్టల్లో వేసుకున్నారు. అయితే చివర్లో ఒకే ఒక్క బంతి వుండటంతో రోహిత్, మెరీనా, బాలాదిత్య, కీర్తి, ఫైమా, సుదీప ఒకరి మీద ఒకరు పడి కుస్తీలు పట్టారు. ఆ బంతిని ఎట్టకేలకు సుదీప దక్కించుకోవడంతో మెరీనా కంటతడి పెట్టుకుంది. తన భర్తకు కానీ, తనకు కానీ బంతి దక్కలేదని బాధపడింది. చివరికి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్‌లు కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.

ఇక.. ఈరోజు చెప్పుకోవాల్సింది మన సూర్య- ఇనయా జంట గురించి. ఎక్కడ సందు దొరికితే అక్కడ ఇద్దరూ ఏకాంతంగా సరసాలు ఆడుతున్నారు. ఇంతకుముందు ఇనయా టఫ్ ఫైట్ ఇస్తూ మంచి కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. కానీ సూర్యకు దగ్గర కావడంతో ఆమె దృష్టి మళ్లింది. ఈరోజు ఇనయా.. లాలీపాప్ చీకుతూ దానిని సూర్య నోట్లో పెట్టింది. మనోడు వెనుకాముందు ఆలోచించకుండా చీకేశాడు. వీళ్ల వ్యవహారం చూస్తుంటే రానున్న రోజుల్లో ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.