close
Choose your channels

BiggBoss: రేవంత్‌కి సర్‌ప్రైజ్, ఫైనల్‌లో అడుగుపెట్టిన శ్రీహాన్.. సీజన్‌కే బెస్ట్ కెప్టెన్‌గా ఇనయా

Sunday, December 4, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ తెలుగు 6 ముగింపు దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో కంటెస్టెంట్స్‌ని ఫైనల్‌కి పంపే ‘‘టికెట్ టు ఫినాలే’’ టాస్క్ హోరాహోరీగా సాగుతోంది. రౌండ్ల వారిగా జరుగుతోన్న గేమ్స్‌లో ఒక్కొక్కరిని తప్పిస్తూ ముందుకు వెళ్తున్నాడు బిగ్‌బాస్. చివరికి శ్రీహాన్, రేవంత్‌లు మిగిలారు. వీరిద్దరిలో ఒకరు గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టనున్నారు. ఇదిలావుండగా రేవంత్ సతీమణి అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఎపిసోడ్ మొదలైన వెంటనే రేవంత్‌ను కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి ఆ విషయం చెప్పాడు. దీంతో అతను సంబరాలు జరుపుకున్నాడు.. ఈ విషయాన్ని ఇంటి సభ్యులతో పంచుకుని ఆనందించాడు. శ్రీహాన్ అయితే ఈలలు వేస్తూ హల్ చల్ చేశాడు. మిగిలిన కంటెస్టెంట్స్ అతనిని అభినందించారు.

ఆ వెంటనే జరిగిన టికెట్ టు ఫినాలే ఫైనల్ రౌండ్ ఆరంభమైంది. ఈ సందర్భంగా రేవంత్, శ్రీహాన్‌ల మధ్య పోరు నడిచింది. ఈ సందర్భంగా వారిద్దరి చేతుల్లో తాడులు పెట్టి ఎవరైతే ఎక్కువసేపు ఊపుతూనే వుంటారో వారే విన్నర్ అని చెప్పాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో రేవంత్ చేతులేత్తేయగా.. శ్రీహాన్ విన్నర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఆరో సీజన్‌లో ఫైనల్‌కి చేరిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడు.

ఇక వీకెండ్ కావడంతో స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. ఆ వెంటనే రేవంత్‌కు తన కూతురిని చూసుకునే అవకాశం కల్పించారు. అతని భార్య అన్విత, కూతురిని ఆసుపత్రిలోంచే చూపించారు. దీంతో రేవంత్ చాలా సంతోషపడిపోతూ.. నాని సినిమాలోని పెదవి పలికిన పాట పాడాడు. మరో రెండు వారాల్లో రేవంత్ ఇంటికి వెళ్లనున్నాడు. అయితే అది కప్పుతోనా, ఒట్టి చేతులతోనా అన్నది అతని ఆటతీరుపైనే ఆధారపడి వుంది.

అనంతరం ఇంటి సభ్యులకు క్లాస్ పీకే పని మొదలెట్టారు నాగార్జున. బిగ్‌‌బాస్ తెలుగు 6వ సీజన్‌లో ఏ వారంలో రిగ్రెట్ ఫీలయ్యారో చెప్పాలని ఆదేశించాడు. తొలుత ఫైమా మాట్లాడుతూ.. ఆరో వారంలో సుధీపతో మాట్లాడటం వల్లే తనకు వెటకారం అన్న ట్యాగ్ వచ్చిందని ఫీల్ అయ్యింది. అలాగే తొమ్మిదో వారంలో నోటికొచ్చినట్లు మాట్లాడానని, అలా అనకుండా వుండాల్సిందని బాధపడింది. తర్వాత శ్రీహాన్ మాట్లాడుతూ.. 12వ వారంలో ఫ్యామిలీ వీక్ సందర్భంగా సిరి చెబితే కానీ తన వెటకారం వల్ల కీర్తి బాధపడిందని తనకు తెలిసిందని చెప్పాడు. తాను అలా ప్రవర్తించకుండా వుండాల్సిందన్నాడు. కీర్తి మాట్లాడుతూ.. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో కోపంతో టవర్‌ను తన్నకుండా వుండాల్సిందని చెప్పుకొచ్చింది.

రేవంత్ కూడా తన కోపం వల్ల జరుగుతున్న పరిణామాలపై మాట్లాడాడు. తొలి వారం నుంచి ఆరో వారం వరకు కోపంతో ఏది పడితే అది చేయడమే కాకుండా బూతులు తిట్టానని చెప్పాడు. చేపల టాస్క్‌లో ఆదిరెడ్డి, గీతూ, ఇనయాలను ఫిజికల్‌గా బాధపెట్టానని రేవంత్ ఫీలయ్యాడు. రోహిత్ మాట్లాడుతూ.. 12వ వారంలో ఇనయాను నమ్మి కెప్టెన్సీ విషయంలో పెద్ద తప్పు చేశానని చెప్పాడు. శ్రీసత్య మాట్లాడుతూ.. 2వ వారంలో గేమ్ ఆడకుండా కూర్చోవడం, 11వ వారంలో కీర్తిని నామినేట్ చేయకుండా వుండాల్సిందని చెప్పింది. ఆదిరెడ్డి చెబుతూ.... ఎవిక్షన్ ఫ్రీ పాస్ వేస్ట్ అని చెప్పడం, అమ్మాయిల విషయంలో ఓవర్ సెన్సిటివ్‌గా ఆడటం తప్పని అంగీకరించాడు.

తర్వాత ఈ సీజన్‌లో బెస్ట్ కెప్టెన్, వరస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పాలని కంటెస్టెంట్స్‌ని అడిగాడు నాగ్. ఎవరెవరు ఏం చెప్పారంటే..

రోహిత్ : బెస్ట్ కెప్టెన్ కీర్తి, వరస్ట్ కెప్టెన్ ఆదిరెడ్డి
ఆదిరెడ్డి : బెస్ట్ కెప్టెన్ ఇనయా, వరస్ట్ కెప్టెన్ శ్రీసత్య
శ్రీసత్య : బెస్ట్ కెప్టెన్ ఇనయా, వరస్ట్ కెప్టెన్ ఆదిరెడ్డి
ఇనయా : బెస్ట్ కెప్టెన్ శ్రీసత్య, వరస్ట్ కెప్టెన్ శ్రీహాన్
శ్రీహాన్ : బెస్ట్ కెప్టెన్ ఇనయా, వరస్ట్ కెప్టెన్ ఆదిరెడ్డి
కీర్తి : బెస్ట్ కెప్టెన్ ఫైమా, వరస్ట్ కెప్టెన్ శ్రీహాన్
ఫైమా : బెస్ట్ కెప్టెన్ ఇనయా, వరస్ట్ కెప్టెన్ రేవంత్
రేవంత్ : బెస్ట్ కెప్టెన్ ఆదిరెడ్డి, వరస్ట్ కెప్టెన్ ఇనయా

మొత్తం మీద ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇనయాను బెస్ట్ కెప్టెన్‌గా, ఆదిరెడ్డిని వరస్ట్ కెప్టెన్‌గా తేల్చారు. సీజన్‌లో చివరి కెప్టెన్‌గా నిలిచిన ఇనయా మంచి గౌరవం పొందినట్లయ్యింది. ఇక ఈ వారం రోహిత్, కీర్తి, ఫైమా, రేవంత్, శ్రీసత్య, ఆదిరెడ్డిలు నామినేషన్స్‌లో వున్నారు. శనివారం రోహిత్, కీర్తిలను నాగ్ సేవ్ చేశారు. మరి రేపు ఎవరు హౌస్‌ను వీడేవారో తెలియాల్సి వుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.