close
Choose your channels

రాముడిగా ప్రభాస్‌నే ఊహించుకున్నా: డైరెక్టర్ ఓం రౌత్

Thursday, January 7, 2021 • తెలుగు Comments

రాముడిగా ప్రభాస్‌నే ఊహించుకున్నా: డైరెక్టర్ ఓం రౌత్

‘బాహుబలి’ సినిమా తరువాతి నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీలపైనే ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పూజా హెగ్డేతో కలిసి ప్రభాస్ ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేసి నెక్ట్స్ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇక ప్రభాస్ తదుపరి చిత్రం ‘ఆదిపురుష్’ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్నాడు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

ఈ సినిమా గురించి, ప్రభాస్ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఓంరౌత్ మాట్లాడారు. ‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ అనుకోగానే తొలుత తన మైండ్‌లో రాముడి పాత్రలో ప్రభాస్‌నే ఊహించుకున్నానని ఓం రౌత్ వెల్లడించారు. ఒకవేళ ఈ ప్రాజెక్టుకు ప్రభాస్ ఒప్పుకోకపోయి ఉంటే అసలు ‘ఆదిపురుష్’ అనే సినిమానే ఉండేది కాదన్నారు. ఆయన కాదని చెప్పి ఉంటే ‘ఆదిపురుష్` స్క్రిప్ట్‌ను పక్కన పెట్టేసి ఉండేవాడినని ఓం రౌత్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 19 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz