close
Choose your channels

ఆ మూవీలో కాజల్ స్థానంలో ఇలియానా.. ఆప్షన్ అవుతుందో, అటకెక్కుతుందో..?

Monday, September 20, 2021 • తెలుగు Comments

ఆ మూవీలో కాజల్ స్థానంలో ఇలియానా.. ఆప్షన్ అవుతుందో, అటకెక్కుతుందో..?

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగునాట తెలియని వారుండరు. సన్ని నడుముతో యువతకు గిలిగింతలు పెట్టిన ఈ సుందరి వరుస బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న అందరు అగ్ర హీరోలతో ఇలియానా నటించింది. అయితే ఇక్కడ కెరియర్ మంచి ఫామ్‌లో వున్న సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ చెక్కేసింది. అయితే అక్కడికి వెళ్లిన తొలి నాళ్లలో అవకాశాలు బాగానే దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇలియానా బాలీవుడ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.

ఆ మూవీలో కాజల్ స్థానంలో ఇలియానా.. ఆప్షన్ అవుతుందో, అటకెక్కుతుందో..?

దీంతో మళ్లీ తెలుగులో ఛాన్స్‌ల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అదృష్టం కలిసిరాకపోవడంతో అవన్నీ విఫలమయ్యాయి. కానీ ఇన్నాళ్లకు ఆమెకు అదృష్టం కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న ‘‘ ది ఘోస్ట్’’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో చిత్ర నిర్మాతలు పలువురు హీరోయిన్లను సంప్రదిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. వీరిలో ఇలియానా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే.. ఇందులో ఇలియానా ఒక ఆప్షన్ మాత్రమేనని.. ఆమె ఫైనల్‌ కాలేదని సమాచారం. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, నిర్మాతలు పలువురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి వారిని సంప్రదిస్తున్నారట. నాగార్జున ఎవరికి ఓటేస్తే వారే హీరోయిన్‌గా ఎంపికవుతారు.

ఆ మూవీలో కాజల్ స్థానంలో ఇలియానా.. ఆప్షన్ అవుతుందో, అటకెక్కుతుందో..?

ఆ మధ్య రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమా ద్వారా తెలుగులో ఇలియానా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇది తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశించిన ఇల్లిబేబికి జనాలు షాకిచ్చారు. ఆ సినిమా దారుణ పరాజయం పాలవ్వడంతో ఆమెని మళ్ళీ ఎవరూ సంప్రదించలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz