close
Choose your channels

Pawan Kalyan:తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా?.. పవన్ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం..

Saturday, March 2, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తాగేందుకు నీళ్లు అడిగితే చంపేస్తారా? అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో దళిత మహిళను వైసీపీ నేతలు ట్రాక్టర్‌తో తొక్కించి హత్య చేశారనే ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.

తాగునీటికి కూడా పార్టీల పరంగా లెక్కలు చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన సామినిబాయిని ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన కలచివేసింది. తాగునీటి కోసం వెళ్తే ప్రతిపక్ష పార్టీ వాళ్లనే పేరుతో అడ్డుకుంటారా? నీళ్లు లేవని ప్రాధేయపడినా.. ట్రాక్టర్‌తో తొక్కించి చంపడాన్ని ఏమనాలి? ఘటనపై అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు విచారణ చేపట్టాలి. వైసీపీ వాళ్లే నీరు తాగాలి.. వైసీపీ వాళ్లే గాలి పీల్చాలి అనే రీతిలో భవిష్యత్తులో జీవో ఇస్తారేమో.. పంచభూతాలకు సైతం పార్టీ రంగులు పులిమే దుర్మార్గపు పాలన ఏపీలో రాజ్యమేలుతోంది. ఈ పాలకుడు మాట్లాడితే నా ఎస్టీలు.. నా ఎస్సీలు.. అంటారు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేస్తూ, ఎస్టీ మహిళలను ట్రాక్టర్లతో తొక్కించేస్తూ హత్యాకాండ సాగించేవాళ్లను వెనకేసుకొచ్చే వ్యక్తికి నా ఎస్టీ.. నా ఎస్సీ.. అనే అర్హత ఉందా?’’ అని పవన్ నిలదీశారు.

మరోవైపు ఇదే ఘటనపై టీడీపీ యువనేత నారా లోకేష్ కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘ట్యాంకర్‌ వద్దకు వచ్చిన సామినిబాయిని వైసీపీ సైకో చంపేశాడు. ట్రాక్టర్‌తో తొక్కించి అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీయడం కలచివేసింది. నీటి కోసం వచ్చిన మహిళను టీడీపీకి చెందిన వ్యక్తివంటూ బెదిరించారు. నీటితో పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే ఆమె చేసిన నేరమా? ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. మనం ఉన్నది రాతియుగంలోనా అనే అనుమానం కలుగుతోంది. ఊరంతా చూస్తుండగానే మూడు సార్లు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశారు. కావాలని చేసినప్పటికీ.. డ్రైవింగ్‌ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేస్తారా? పతనమైన పోలీసు వ్యవస్థకు ఇది పరాకాష్ఠ కాదా?’’ అని లోకేశ్‌ మండిపడ్డారు.

కాగా రెంటచింతల మండలం మల్లవరంలో నీళ్లు పట్టుకోవడానికి ట్యాంకర్ దగ్గరకు వెళ్లిన ఓ ఎస్టీ మహిళను ట్రాక్టర్‌తో ఢీ కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మాచర్ల ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మరో నెల రోజుల్లోనే వైసీపీ అరాచక ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.