Nara Bhuvaneshwari:చంద్రబాబు గారికి విశ్రాంతి ఇచ్చి కుప్పం నుంచి నేను పోటీ చేస్తా: భువనేశ్వరి
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తుంటే.. మరోవైపు పొత్తుల నేపథ్యంలో టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారుతోంది. దీంతో ఇరు పార్టీల నాయకులు టికెట్ తమకంటే తమకు అని ప్రకించుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కుప్పం నుంచి ఏడు సార్లు గెలిచిన చంద్రబాబుకు ఈసారి విశ్రాంతి ఇచ్చి తాను పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆమె వ్యాఖ్యానించారు.
నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. కుప్పంలో రెండు కుటుంబాలను ఆమె పరామర్శించి మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సయం చేశారు. అనంతరం 'ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ తనకు మనసులో ఒక కోరిక కలిగిందని తెలిపారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారని.. ఈసారి తనకు పోటీ చేయాలని ఉందని.. తనను గెలిపిస్తారా..? అని అడిగారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
దీంతో అధికార వైసీపీ నేతలు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. "చంద్రబాబు స్థానంలో కుప్పం నుంచి పోటీ చేస్తానని భువనేశ్వరి గారు ప్రకటించారు. ఆమె మాటతో టీడీపీ, జనసేన కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు. నిజంగానే ఆమె చెప్పినట్టు నువ్వు రెస్ట్ తీసుకునే సమయం వచ్చింది చంద్రబాబూ..!" అంటూ వైసీపీ తన అధికారిక ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
దీనిపై తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. "భువనేశ్వరి గారు చెప్పింది ఏంటి, ఈ సైకో ఫేక్ చేసింది ఏంటో చూడండి. ఇలా తృప్తి పడుతూ, శునకానందం పొందే బ్రతుకులూ బ్రతుకేనా?" అంటూ ఆమె మాట్లాడిన పూర్తి వీడియోను ట్వీట్ చేసింది.
వాస్తవంగా భువనేశ్వరి ఏం మాట్లాడారంటే.. "చంద్రబాబు గారిని 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అని అడిగారు. దాంతో సభకు వచ్చిన వాళ్లు ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు. అలా కుదరదు... ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ కోరారు. అయితే ఇది తాను సరదాగానే అంటున్నాను. ప్రస్తుతం నేను చాలా హ్యాపీగా ఉన్నాను.. మా ఆయన బాగా చూసుకుంటున్నారు. నాకు ఏ పోస్ట్ అవసరం లేదు. సరదాగా ఏదో జోక్‌గా అన్నాను. అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలి" అని వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments