నేను 1995లోనే చెప్పాను: చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-ఐటీ గురించి తను 1995లో చెప్పానన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి కుటుంబం నుంచి ఓ ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని, అప్పుడే రాష్ట్రంలో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని తను అప్పుడే చెప్పానని, ఇప్పుడు తను చెప్పింది నిజమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్స్ ఐటీ రంగంలో దూసుకుపోతున్నారని, పెద్దపెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు.
ఇప్పుడు తను ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఏఐ గురించి మాట్లాడుతున్నానని, రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఓ ఏఐ ప్రొఫెషనల్ ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ రాజ్యమేలుతుందని, అన్ని రంగాల్ని, అన్ని పరిస్థితుల్ని అది మార్చేస్తుందని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి.
రాబోయే రోజుల్లో డబ్బు ముఖ్యం కాదంటున్నారు చంద్రబాబు. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయనేది ముఖ్యం కాదని, ఎంత డేటా ఉందనేది ముఖ్యమని అన్నారు. భవిష్యత్తు మొత్తం డేటా చుట్టూనే తిరుగుతుందని, డేటాను సరిగ్గా విశ్లేషించి, వినియోగించుకున్నోళ్లదే రాజ్యమని అంచనా వేశారు.
గుంటూరులో సీఎం పర్యటించారు. కిమ్స్ శిఖర ఆస్పత్రిని ప్రారంభించారు. అతిపెద్ద వైద్య సంస్థల్లో ఒకటిగా కిమ్స్ గుర్తింపు పొందిందని, ఏకంగా 5 రాష్ట్రాల్లో సేవలు అందిస్తోందని కొనియాడారు. అప్పట్లో గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారని, ఇక తన అత్తగారు కాన్సర్ తో చనిపోయారని అన్నారు చంద్రబాబు. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్లు, కాన్సర్ ట్రీట్ మెంట్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, మన దగ్గరే అత్యుత్తమమైన టెక్నాలజీతో పాటు, మంచి వైద్యులు అందుబాటులో ఉన్నారని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments