close
Choose your channels

వాళ్ల‌ను ఎందుకు హీరోయిన్స్ గా తీసుకుంటున్నారో్ అర్ధం కావ‌డం లేదు - చాందిని చౌద‌రి

Thursday, June 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుధాక‌ర్, సుధీర్, చాందిని చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా వ‌ర ముళ్ల‌పూడి తెర‌కెక్కించిన చిత్రం కుంద‌న‌పు బొమ్మ‌. విభిన్న ప్రేమ క‌థా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కుంద‌న‌పు బొమ్మ చాందిని చౌద‌రితో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

మీ గురించి..?

నేను వైజాగ్ లో పుట్టి పెరిగాను. చిన్న‌ప్ప‌టి నుంచి ఏక్టింగ్ అంటే బాగా ఇష్టం. బెంగుళూరులో ఇంజ‌నీరింగ్ చేస్తూ...స‌ర‌దాగా మ‌ధురం అనే షార్ట్ ఫిల్మ్ చేసాను. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి అనుకోకుండా కుంద‌న‌పు బొమ్మ లో అవ‌కాశం ఇచ్చారు. తెలుగుద‌నం ఉన్న ఓ మంచి సినిమాలో న‌టించినందుకు చాలా సంతోషంగా ఉంది.

రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణి, వ‌ర ముళ్లపూడి...క‌లిసి చేస్తున్న సినిమా కాబ‌ట్టి ఈ సినిమా చేసారా..?

రాఘ‌వేంద్ర‌రావుగారు, కీర‌వాణి గారు, వ‌ర ముళ్ల‌పూడి గారు క‌లిసి చేస్తున్న‌సినిమాలో అవ‌కాశం అన‌గానే...లెజెండ్స్ తో వ‌ర్క్ చేయ‌డం అదృష్టంగా భావించి ఫ‌స్ట్ ఓకే చెప్పాను. క‌థ విన్న‌ప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల‌య్యాను.

కుంద‌న‌పు బొమ్మ‌లో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

ప‌ల్లెటూరి అమ్మాయి క్యారెక్ట‌ర్ చేసాను. నా క్యారెక్ట‌ర్ పేరు సుచి. ఇంట్లో..ఆ ఊరులో చాలా గారాబంగా చూసుకుంటారు. మంచి అమ్మాయి అనిపించేలా నా క్యారెక్ట‌ర్ ఉంటుంది. ప‌ర్ ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న‌క్యారెక్ట‌ర్ ఇది. మంచి పేరు తీసుకువ‌స్తుంద‌నే నమ్మ‌కం ఉంది.

సుధాక‌ర్, సుధీర్, మీరు క‌లిసి న‌టించారు క‌దా..ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ అనుకోవ‌చ్చా..?

ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ అంటే అవును అని చెప్ప‌లేం...కాదు అని చెప్ప‌లేం. ఇదొక డిఫ‌రెంట్ స్టోరీ. నేను చెప్ప‌డం క‌న్నా తెర‌ పై చూస్తే మీకే తెలుస్తుంది.

బ్ర‌హ్మోత్స‌వం లో చిన్న క్యారెక్ట‌ర్ చేసారు క‌దా...స్పెష‌ల్ క్యారెక్ట‌ర్స్ కూడా చేయాల‌నుకుంటున్నారా..?

మ‌హేష్ బాబు సినిమా కాబ‌ట్టి స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ అంటే చేసాను. ఇక నుంచి స్పెష‌ల్ క్యారెక్ట‌ర్స్ చేయాల‌నుకోవ‌డం లేదు. హీరోయిన్ గానే చేస్తాను.

ఇండ‌స్ట్రీకి హీరోయిన్ గా తెలుగ‌మ్మాయిలు చాలా త‌క్కువ మంది మాత్రమే వ‌స్తున్నారు కార‌ణం ఏమిట‌నుకుంటున్నారు..?

నేను అదే ఆలోచిస్తున్నాను అండీ...త‌ల్లిదండ్ర‌లు హీరోయిన్ అవుతాను అంటే నో చెబుతున్నారో..లేక మ‌న డైరెక్ట‌ర్స్, ప్రొడ్యూస‌ర్స్ ముంబాయి హీరోయిన్స్ కావాల‌నుకుంటున్నారో తెలియ‌డం లేదు. భాష రాని వాళ్ల‌ను ముంబాయి నుంచి తీసుకువ‌చ్చి మ‌రీ...వాళ్ల‌కు ఎందుకు అవ‌కాశాలు ఇస్తున్నారో నాకు తెలియ‌డం లేదు. నా వ‌ర‌కు అయితే..మా ఇంట్లో చెప్ప‌గానే...ఫ‌స్ట్ ఎడ్యుకేష‌న్ కంప్లీట్ చెయ్...ఆత‌ర్వాత నీ ఇష్టం అన్నారు. భ‌విష్య‌త్ లో తెలుగ‌మ్మాయిలు ఎక్కువ‌గా ఇండ‌స్ట్రీకి వ‌స్తారేమో...

మీరు ఎలాంటి పాత్ర‌లు చేయాల‌నుకుంటున్నారు..?

న‌ట‌కు అవ‌కాశం ఉన్న వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయాల‌నుకుంటున్నాను.

గ్లామ‌రస్ రోల్స్ ...స్కిన్ షో చేయాల్సి వ‌స్తే చేస్తారా..?

క్యారెక్ట‌ర్ డిమాండ్ చేస్తే గ్లామ‌ర‌స్ రోల్స్ చేస్తాను. స్కిన్ షో అనేది మితిమీర‌కుండా ఓ ప‌రిమితి వ‌ర‌కు చేస్తాను.

మీ ఫేవ‌రేట్ హీరో..?

ర‌జ‌నీకాంత్. జీవితంలో ఎప్ప‌టికైనా ర‌జ‌నీకాంత్ ని క‌ల‌వాలి. తెలుగులో అంత‌గా అభిమాన హీరో అంటూ ఎవ‌రూ లేరు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?

రాహుల్ ర‌వీంద్ర‌న్ హీరోగా రేవ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నాను. అలాగే మ‌ధురం షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ ఫ‌ణీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తున్నాను. ఈ చిత్రంలో బ్ర‌హ్మానందం గారి అబ్బాయి రాజా గౌత‌మ్ తో క‌లిసి న‌టిస్తున్నాను. ఈ చిత్రం టైటిల్ మ‌ను. ఇది ఓ డిఫ‌రెంట్ మూవీ. ఇందులో పాట‌లు ఉండ‌వు. ఈ చిత్రం షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment