తెలంగాణ ప్రజలకు హైడ్రా హెచ్చరిక


Send us your feedback to audioarticles@vaarta.com


తెలంగాణ ప్రజలకు హైడ్రా మరో హెచ్చరిక చేసింది. ఫార్మ్ ప్లాట్స్ పేరిట అనుమతి లేని లే-ఔట్లలో కొనుగోలు చేసి మోసపోవద్దని హెచ్చరించింది. అనుమతి లేని లే ఔట్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడొద్దని హైడ్రా సూచించింది. నగర శివార్లలో ఫార్మ్ ప్లాట్ల పేరిట అమ్మకాలు జరుగుతున్నాయని.. వీటిని కొన్న వారు తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేదం ఉన్నప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని, కొన్ని ఫిర్యాదులు కూడా అందాయని తెలిపింది హైడ్రా.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం, లక్ష్మిగూడ విలేజ్ సర్వే నంబరు 50లోని 1.02 ఎకరాల్లో ఫార్మ్ ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని సోమవారం హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ రంగనాధ్ స్పందించారు.
తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018లో పొందుపరిచిన విధంగా ఎక్కడా ఫార్మ్ ప్లాట్లు అమ్మడానికి లేదనిపేర్కొన్నారు. ఫార్మ్ ల్యాండ్ అంటే 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com