close
Choose your channels

భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని భర్త ట్రిపుల్ తలాక్!

Friday, November 1, 2019 • తెలుగు Comments

భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని భర్త ట్రిపుల్ తలాక్!

ట్రిపుల్ తలాక్ ఏ క్షణాన వెలుగులోకి వచ్చిందో కానీ.. దీన్ని అడ్డుపెట్టుకుని కొందరు ముస్లిం సోదరులు ఆడవారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికే పలు విచిత్ర కారణాలతో భార్యలకు భర్త తలాక్ చెప్పాడన్న వార్తలను మనందరమూ చదివేవుంటాం. దీన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ ఈ పద్ధతికి అడ్డుకట్ట పడట్లేదు. పెళ్లయిన మూడు నెలలకే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడో భర్త. ఈ ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇందుకు కారణం.. భార్యకు దంతాలు సరిగ్గా లేవని ట్రిపుల్ తలాక్ చెప్పినట్లు భర్త ముస్తఫా చెబుతున్నాడు.

అసలేం జరిగింది..!?

ఈ విషయమై బాధితురాలు రుక్సానా బేగం మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరైంది. ‘నాకు దంతాలు సరిగ్గా లేవని నా భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. కొంత కాలంగా ఈ కారణంగా నా భర్త వేధించాడు. నన్ను ఇక కలవద్దని, మన మధ్య బంధం తెగిపోయిందని అంటున్నాడు. నాకు న్యాయం చేయాలని కోరింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ట్రిపుల్‌ తలాక్‌ కేసు నమోదయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్‌ చెప్పే భర్తకు మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

Get Breaking News Alerts From IndiaGlitz