close
Choose your channels

సన్నీ.. ముంబై దాటి అమెరికా ఎలా వెళ్లింది!?

Tuesday, May 12, 2020 • తెలుగు Comments

సన్నీ.. ముంబై దాటి అమెరికా ఎలా వెళ్లింది!?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇండియాలో రోజురోజుకు విస్తరిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. మే-17తో 3.0 లాక్‌డౌన్ పూర్తి కానుంది. దీంతో ఎక్కడ ఉన్న కార్మికులు, సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం పోలీసులు పసిగట్టేస్తున్నారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే వారిని స్టేషన్‌కు కూడా తరలించేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎక్కడికి పోవాలన్నా రావాలన్నా ఇప్పట్లో అసలు కుదిరే పనికాదు.

సన్నీకే ఎలా సాధ్యం!?

మరోవైపు ప్రజా రవాణా వ్యవస్థ అయిన బస్సు, రైళ్లు, విమానాలు ఏవి కూడా నడవట్లేదు. అయితే.. ఈ పరిస్థితుల్లో దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నుంచి అమెరికా వెళ్లడం అంటే ఆషామాషీ పనేనా..? అంటే అస్సలు ఇది జరిగే పనే కాదు. కానీ అలనాటి పోర్న్ స్టార్.. బాలీవుడ్ ఐటెం భామ సన్నీలియోన్ మాత్రం ముంబై నుంచి అమెరికాకు చెక్కేసింది. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ హాట్ భామే వెల్లడించింది. అంతేకాదు.. తన భర్త డేనియర్ వెబర్, పిల్లలు నిషా, నోవా, అషర్‌లతో కలిసి అమెరికాకు వెళ్లినట్టు చెప్పుకొచ్చింది. ‘మదర్స్ డే’ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘మీ జీవితంలో పిల్లలు ఉన్నపుడు మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి. మిగిలిన వాటి కంటే వారి క్షేమమే ముఖ్యం అవుతుంది. కరోనా మహమ్మారి అనేది కంటికి కనిపించని వైరస్, వ్యాధి. దీని గురించి సురక్షితంగా ఉండగలమని మేము అనుకునే చోటికి వెళ్లేందుకు మాకు అవకాశం లభించింది. మేము లాస్ ఎంజెల్స్‌లో ఉన్న మా ఇంట్లోనీ సీక్రెట్ గార్డెన్స్‌లో ఉన్నాం. మా అమ్మే ఉండి ఉంటే నన్ను ఇలానే చేయమని చెప్పేది.. మిస్ యూ మమ్మీ.. హ్యాపీ మదర్స్ డే’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు తాను ముగ్గురు పిల్లలతో ఉన్న ఫొటో.. భర్త ఫొటోను పోస్ట్ చేసింది.

కవరింగా.. నిజమా..!?

అయితే నిన్న మొన్నటి వరకూ ముంబైలో ఉన్న సన్నీ అమెరికాకు ఎలా వెళ్లిందబ్బా..? అని అభిమానులు, సినీ ప్రియులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు అసలేం జరిగింది..? ఇన్ని రోజులు సన్నీ ముంబైలోనే ఉన్నదా..? లేకుంటే అమెరికాలో ఉండి ముంబైలో ఉన్నట్లు కవరింగ్ చేసుకుందా..? ఒకవేళ ముంబై నుంచి అమెరికా వెళ్లినట్లయితే ఇదెలా సాధ్యం..? ప్రభుత్వం యంత్రాంలో ఎవరైనా పెద్ద తలకాయ సహాయ సహకారాలతో వెళ్లింది..? అనేది తెలియరాలేదు. ముంబై వదిలిన విషయమే నిజమైతే మాత్రం పరిస్థితులు ఇంకోలా ఉంటాయన్నది జగమెరిగిన సత్యమే. దీంతో నెటిజన్లు, సినీ ప్రియులు సన్నీపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై క్లారిటీ రావాలంటే మరోసారి సన్నీ క్లారిటీ ఇచ్చుకోక తప్పదు మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz