మహిళా దినోత్సవంలో హోం మంత్రి అనిత


Send us your feedback to audioarticles@vaarta.com


అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్న హొంమంత్రి.. మహిళల నాయకత్వం- సవాళ్లు , పురోగమించే మార్గాలపై చర్చించారు.
ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి.. మహిళను విమర్శించాలంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుండడం దుర్మార్గం అన్నారు. తన దృష్టిలో కూలి పని చేసే స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రతి మహిళా గొప్పదేనని అన్నారు.
అనేక అవమానాలను అధిగమించి ఓ సాధారణ గృహిణి నుంచి హోం మినిస్టర్ స్థాయికి, చేరడంలో సీఎం చంద్రబాబు సహా ఎంతో మంది సహకారం ఉందిన్నారు అనిత. ఆడపిల్లవి జాగ్రత్త అనే చెప్పే బదులు మగపిల్లాడికి జాగ్రత్తలు చెప్పి బయటకు పంపే రోజులు రావాలని కోరారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం పిల్లలను ఎక్కువ కనడంపై ఈ సమావేశంలో ఆసక్తికరమైన చర్చ సాగింది. మెటర్నటీ బెన్‌ఫిట్‌లను పెంచడంపై సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్త, ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారి, లా అండ్ ఆర్డర్ ఏఐజీ సిద్ధార్థ్ కౌశల్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, ఏఎన్‌యూ కాలేజ్ ఆర్ట్స్ ప్రొఫెసర్ సరస్వతి రాజు, వాసవ్య మహిళా మండలి ఛైర్మన్ చెన్నుపాటి కీర్తి, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు, ఎన్టీఆర్ కమిషనరేట్ డిప్యూటీ కమిషనర్ కెజివి సరిత, అవేరా సంస్థ సహ వ్యవస్థాపకులు చాందిని చందన తదితరులు హాజరయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments