close
Choose your channels

చేతల మనిషినని అంటున్న హీరోయిన్

Friday, July 14, 2017 • తెలుగు Comments

మహేష్‌భట్‌ కూతురుగా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకొని యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది అలియా భ‌ట్. తక్కువ టైమ్‌లోనే బిజీ హీరోయిన్‌ అయిపోయింది. ఈ సంవత్సరం మూడు సినిమాలు చేస్తూ యమా బిజీగా వుంది. హీరోయిన్‌గా మరింత ఎత్తుకు ఎదగాలన్నది అలియా లక్ష్యమట. ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా తను చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు రెండు వున్నాయని చెప్తోంది. అవేమిటంటే ఆడపిల్లల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం ఒక కార్యక్రమం చేపట్టడం, మూగ జీవాలకు ఆశ్రయం కల్పించడం.

ఈ రెండు పనులు ఇంకా కార్యరూపం దాల్చకపోయినా త్వరలోనే అవి పూర్తి చేస్తానని చెప్తోంది అలియా. తను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని నొక్కి మరీ చెప్తోంది. షారూఖ్‌ఖాన్‌ తన అభిమాన హీరో అని చెప్తున్న అలియా తన లైఫ్‌లో వీకెండ్‌ పార్టీలు తక్కువేనంటోంది. ఖాళీ దొరికితే వీకెండ్‌ పార్టీలు ఎరేంజ్‌ చేస్తుందట. లేట్‌నైట్‌ పార్టీలంటే ఇష్టపడని అలియాకి డ్రింక్‌ చెయ్యడం కూడా నచ్చదట. ఫ్రెండ్స్‌ బలవంతం మీద లైట్‌గా సిప్‌ చేస్తానంటోంది. నచ్చిన ప్రదేశం గ్రీస్‌ అనీ, వీలైతే తన పుట్టినరోజు అక్కడ జరుపుకుంటుందట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz