close
Choose your channels

పవన్ కల్యాణ్‌పై హీరో షాకింగ్ కామెంట్స్!!

Monday, January 27, 2020 • తెలుగు Comments

పవన్ కల్యాణ్‌పై హీరో షాకింగ్ కామెంట్స్!!

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో అసలేం జరుగుతోంది..? ఆయనెందుకిలా ఫైర్ అవుతున్నారని ఇటు టాలీవుడ్‌లో.. అటు రాజకీయాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఆ విమర్శలు చేసింది ఎవరో తెలియని వ్యక్తా అంటే అది కూడా కాదు.. టాలీవుడ్‌ హీరోనే కావడం గమనార్హం. ఇంతకీ పవన్‌ను ఆ హీరో ఏమన్నాడు..? పవన్‌నే ఆయన ఎందుకు టార్గెట్ చేసుకున్నారు..? ఆ హీరోగారి భాదేంటి..? అనే విషయాలు www.indiaglitz.com అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ఎందుకు టార్గెట్ చేసినట్లు!?
‘ఆనంద్’, ‘వెన్నెల’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అందాల హీరో రాజా గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అప్పుడెప్పుడో అలా మెరిసిన రాజా.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. అయితే.. సినిమాలకు స్వస్తి చెప్పిన రాజా క్రైస్తవ సువార్తికుడిగా ‘బ్రదర్‌ రాజా’గా మారిపోయాడు. ఇలా మారిపోయిన నాటి నుంచి ఇంతవరకూ ఆయన.. సినిమాల వైపు గానీ.. వార్తల్లో గానీ నిలిచిన సందర్భాల్లేవ్. కేవలం ఆయన ప్రసంగాలు యూ ట్యూబ్‌కే పరిమితం అయ్యాయి. అయితే తాజాగా.. ఇదిగో ఇలా జనసేనాని పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అయితే ఆయన పవన్‌నే ఎందుకు టార్గెట్ చేశాడనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

జనాల్లోకి వెళ్లవయ్యా!?
‘పవన్.. ఇంతకీ ఎవరు నువ్వు.. నువ్వేమైనా మెస్సయ్య అనుకుంటున్నావా? ఏంటి..? నువ్వేమైనా లోకరక్షకుడివా. ఎందుకయ్యా నీకు అంత అహంకారం. ప్రజల మధ్యలోకి వెళ్లి కనీసం వారం రోజుల పాదయాత్ర చేయవయ్యా.. పవన్ కనీసం అప్పుడైనా వాళ్ల బాధ నీకు తెలుస్తోంది. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల ఆవేదనను తెలుసుకుని అప్పుడు మాట్లాడండి.. అంతేకానీ ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివేస్తే ఏమీ రాదు.. ఎవరో ఒకరు నిన్ను నడిపిస్తే నువ్ వాళ్లు చెప్పినట్టు బొమ్మలా నటించడం కాదు.. వాళ్ల చేతుల్లో కీలుబొమ్మగా మారి ఏదేదో మాట్లాడుతున్నావ్’ అని పవన్‌పై రాజా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రియాక్షన్ ఏంటో!?
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పవన్ విమర్శిస్తున్నాడు గనుక అందుకే.. జనసేనానిని రాజా టార్గెట్ చేశాడని అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది పవన్, ఆయన వీరాభిమానులు, పార్టీ శ్రేణుల దృష్టికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో.. అసలు పవన్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz