close
Choose your channels

Bigg Boss 7 Telugu : బొక్కలో బిగ్‌బాస్.. గేట్లు తీస్తే వెళ్లిపోతా, కాఫీ కోసం శివాజీ రచ్చ

Friday, September 8, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ హౌస్‌లో ఈసారి అన్నీ మార్చేశాం.. ఉల్టా పల్టా సీజన్ అని చెప్పారు నిర్వాహకులు. కంటెస్టెంట్స్‌ని కూడా మార్చేశామని చెప్పారు. పేపర్ మీద లిస్ట్ అలాగే వుంది కానీ. వాస్తవంలో మాత్రం అలా కనిపించడం లేదు. గతంలో గ్రూప్ పర్ఫార్మ్ వుండేవారు. ఇప్పుడు మాత్రం ఎవరికి వారు సోలో అయిపోతున్నారు. షోను నిలబెట్టాలనే ఉద్దేశంతో ఏకంగా బిగ్‌బాస్ రంగంలోకి దిగి.. అలా చేయండి, ఇలా చేయండి అంటూ సూచనలు ఇచ్చేసరికి జనాలకు బిగ్‌బాస్ మీద చిర్రెత్తుకొస్తోంది.

ఇక సీనియర్ హీరో శివాజీలో ఎందుకో తెలియదు కానీ ఫ్రస్ట్రేషన్ పీక్స్‌లో వుంటోంది. తొలి రోజే టేస్టీ తేజ పెద్దాయన అని పిలిస్తే.. ఎవడ్రా పెద్దాయన అంటూ తన యాటిట్యూడ్ చూపించాడు. ఇవాళ తన విశ్వరూపం చూపించాడు. కాఫీ పౌడర్ పంపించలేదంటూ.. చేతిలో వున్న వస్తువులను నేలపై విసిరేశాడు. గంట టైమిస్తున్నా అని ఏకంగా బిగ్‌బాస్‌కే వార్నింగ్ ఇచ్చాడు. తాను ఎవరికీ భయపడనని.. దారిలో వున్న బకెట్‌ను ఇతర వస్తువులను తన్నుకుంటూ వెళ్లాడు. స్వతహాగా ఇలాంటి పనులు చేస్తే బిగ్‌బాస్ నుంచి తక్షణం వార్నింగ్ బెల్ మోగేది. కానీ ఈసారి అలా జరగలేదు. గౌతమ్‌కి బీపీ మెషిన్ ఇచ్చి శివాజీకి ఎంత వుందో చెక్ చేయమన్నాడు. నాకేం బీపీ ఎక్కువ కాలేదని.. తలుపులు తీస్తే వెంటనే బయటకి వెళ్లిపోతానంటూ బిల్డప్ ఇచ్చాడు శివాజీ.

శివాజీ వ్యవహారంతో వేడెక్కిన ఇంటిని కూల్ చేయాలనే ఉద్దేశంతో రతికకు చిన్న టాస్క్ ఇచ్చాడు. ఓ స్టెతస్కోప్ ఇచ్చి అందరి గుండె ఏం చెబుతుందో తనకు తెలియజేయాలని ఆదేశించాడు. దీనికి శివాజీకి కోపం వచ్చింది. నేనిక్కడ బాధపడుతుంటే కామెడీగా వుందా అంటూ బిగ్‌బాస్‌పై కేకలు వేశాడు. ఇక లాభం లేదు.. రొమాంటిక్ టచ్ ఇవ్వాలని భావించిన బిగ్‌బాస్.. ప్రేమ పక్షులుగా మారేందుకు సిద్ధమవుతున్న రతిక, పల్లవి ప్రశాంత్‌లను టార్గెట్ చేశాడు. తానే మధ్యవర్తిగా చేశాడు. ప్రశాంత్ గుండె ఎలా కొట్టుకుంటుందో చెక్ చేయాలని రతికను ఆదేశించాడు. దీంతో ప్రశాంత్ గుండెపై స్టెతస్కోప్ పెట్టగా.. అది రతిక రతిక అని కొట్టుకుంటోందని తెలిపింది.

అనంతరం శివాజీని చల్లార్చేపనిలో భాగంగా అతనిని యాక్టివిటీ రూమ్‌కు పిలిచాడు బిగ్‌బాస్. అక్కడ శివాజీకి కాఫీ ఇచ్చి పంపించేశాడు. తర్వాత శోభా శెట్టిని పిలిచి ఇంట్లో ఒకరిని ఫ్లటింగ్ చేయాలని చెప్పగా.. ఆమె రొమాంటిక్ చూపులు, యాక్టివిటీతో టేస్టీ తేజని ఫ్లట్ చేసింది. అనంతరం ఇంటి సభ్యులను ఒక్కొక్కరిని లోపలికి పిలిచిన బిగ్‌బాస్.. గాసిప్స్ గురించి అడిగారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment