close
Choose your channels

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ‘హీరో’ దొరికేశాడోచ్!!

Monday, July 15, 2019 • తెలుగు Comments

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ‘హీరో’ దొరికేశాడోచ్!!

ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో రాఘవేంద్రరావు ఒక సినిమాను తెరకెక్కిస్తున్నట్లు అప్పట్లో స్వయానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా దర్శకేంద్రడు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమని.. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నట్లు ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ జయంతి రోజున రాఘవేంద్రరావు ప్రకటించారు. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరనే విషయాన్ని ఆ ప్రకటన వెలువడిన నాటి నుంచి ఇంత వరకూ వెల్లడించలేదు.

తాజాగా.. దర్శకేంద్రుడికి హీరో దొరికేశారని ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. ఆ హీరో ఎవరో కాదండోయ్.. నాగశౌర్యేనట. నాగశౌర్య హీరోగా ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా రూపొందనుంది. కాగా ఈ ముగ్గురు కథానాయికల జోడీగా కనిపించేది నాగశౌర్యేనని పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. లవ్ సినిమాల్లో ఎక్కువగా నటించే నాగశౌర్య అయితే ఈ కథకు సరిగ్గా సెట్ అవుతారని భావించిన రాఘవేంద్రరావు ఈ కుర్రహీరోను తీసుకోబోతున్నారట.

అంతేకాదు.. కొత్తదనం కోసం ఈ సినిమాలో మూడు ప్రేమకథలను రూపొందించడానికిగాను రాఘవేంద్రరావు ముగ్గురు దర్శకులను తీసుకోనున్నారట. కాగా ఇప్పటికే క్రిష్‌ను ఒప్పించేశారని.. మరో ఇద్దర్ని పట్టుకునే పనిలో రాఘవేంద్రరావు బిజిబిజీగా ఉన్నారట. అయితే ఆ ఇద్దరు దర్శకులు ఎవరనేది త్వరలోనే తేలనుందన్న మాట. కాగా.. ఈ చిత్రానికి గోపీమోహన్ .. బీవీఎస్ రవి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టుగా సమాచారం. సో.. దర్శకేంద్రుడి సినిమా విషయంలో మాత్రం రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz