close
Choose your channels

ప్ర‌భాస్‌కు షాకిచ్చిన మోహ‌న్‌బాబు..?

Saturday, February 22, 2020 • తెలుగు Comments

ప్ర‌భాస్‌కు షాకిచ్చిన మోహ‌న్‌బాబు..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్‌కి సీనియ‌ర్ విల‌క్ష‌ణ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు షాకిచ్చారా? అంటే అవున‌నే సమాధానం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతుంది. నిజానికి మోహ‌న్‌బాబు, ప్ర‌భాస్ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. మోహ‌న్‌బాబుని ప్ర‌భాస్ బావ అని సంబోధిస్తుంటాడు కూడా. అలాంటి అనుబంధం ఉన్న వ్య‌క్తికి మోహ‌న్‌బాబు ఎందుకు షాకిచ్చాడు? అనే విష‌యంలోకి వెళితే.. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా మోహ‌న్‌బాబు త‌న కొడుకు మంచు విష్ణుతో భ‌క్త‌క‌న్న‌ప్ప సినిమా తీయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించాడు. ఈ పౌరాణిక చిత్రం కోసం 60 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌ను కూడా అనుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

కానీ భ‌క్త‌క‌న్న‌ప్ప అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుకు వ‌చ్చే న‌టుడు రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు. ఈయ‌న త‌న త‌మ్ముడు కొడుకు, యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌తో భ‌క్త‌క‌న్న‌ప్ప తీయాల‌నుకుంటున్నాన‌ని ఓ సంద‌ర్భంలో ప్ర‌క‌టించాడు. ఇలాంటి నేప‌థ్యంలో మంచు మోహ‌న్‌బాబు ఓ అడుగు ముందుకు వేసి భ‌క్త‌క‌న్న‌ప్ప సినిమాను అనౌన్స్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌స్తుతం మంచు విష్ణు హీరోగా, నిర్మాత‌గా చాలా బిజీగా ఉన్నాడు. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌ను నిర్మిస్తున్నాడు. మ‌రి భ‌క్త క‌న్న‌ప్ప సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియాలంటే వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Get Breaking News Alerts From IndiaGlitz