close
Choose your channels

మ‌హేశ్ సినిమా ఆగిపోయిందా?

Saturday, February 22, 2020 • తెలుగు Comments

మ‌హేశ్ సినిమా ఆగిపోయిందా?

ఈ ఏడాది సంక్రాంతికి ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ పెద్ద హిట్ సాధించాడు. మహేశ్ 26వ చిత్ర‌మిది. మహేశ్ తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు కూడా తెలిపారు. వంశీ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న‌ట్లు ఈ సినిమాలో మ‌హేశ్ గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్న‌ట్లు కూడా వార్త‌లు వినిపించాయి. లేటెస్ట్‌గా సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు ఈ సినిమా ఆగిపోయింద‌ట‌.

వంశీ త‌యారు చేసిన మాపియా బ్యాక్‌డ్రాప్ క‌థ మ‌హేశ్‌కు న‌చ్చ‌లేద‌ట‌. త్వ‌ర‌లోనే మ‌రో ద‌ర్శ‌కుడితో మ‌హేశ్ త‌న సినిమాను స్టార్ట్ చేస్తాడ‌ని అంటున్నారు. గ‌తంలో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కత్వంలో మ‌హేశ్ `మ‌హ‌ర్షి` సినిమా చేశాడు. ఈసినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఆ సినిమా నుండి ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదే అనుబంధంతో వంశీకి మ‌హేశ్ మ‌రో సినిమా చేసే అవ‌కాశం క‌ల్పించాడు. మ‌రిప్పుడేమో రెడ్ సిగ్న‌ల్ వేసేశాడ‌ని అంటున్నారు. మ‌రి దీనిపై వంశీ పైడిప‌ల్లి, నిర్మాత దిల్‌రాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz