close
Choose your channels

ప్ర‌భాస్ అభిమానులకు గుడ్ న్యూస్‌

Wednesday, July 8, 2020 • తెలుగు Comments

ప్ర‌భాస్ అభిమానులకు గుడ్ న్యూస్‌

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. కానీ.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాపై ప్ర‌భాస్ చాలా కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసి న‌టిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా హిందీ, తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచ‌ర్‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ మిన‌హా మ‌రే అప్‌డేట్స్ లేవు. దీంతో ప్ర‌భాస్ అభిమానులు నిర్మాణ సంస్థ‌పై గుర్రుగా ఉన్నారు. చాలా సార్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా నిర్మాణ సంస్థ‌పై ప్ర‌భాస్ అభిమానులు నిర‌స‌న కూడా వ్య‌క్తం చేశారు. అయితే ఈసారి ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌ను చెప్ప‌బోతోంది చిత్ర యూనిట్‌. జూలై 10న ఉద‌యం ప‌ది గంట‌ల‌కు ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌బోతున‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఓ డియ‌ర్‌, రాధేశ్యామ్ అనే టైటిల్స్ ఎక్కువ‌గా విన‌ప‌డుతున్న స‌మ‌యంలోయూనిట్ ఎలాంటి టైటిల్‌ను ఖ‌రారు చేస్తుందో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz