close
Choose your channels

విశాల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి

Saturday, October 12, 2019 • తెలుగు Comments

విశాల్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి

త‌మిళ హీరో, న‌డిగ‌ర్‌సంఘం కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు విశాల్ సినిమాల‌కు తెలుగులోనూ మంచి ఆద‌ర‌ణ  ఉన్నాయి. అందుక‌నే విశాల్ సినిమాల‌ను అటు త‌మిళంలోనూ, ఇటు తెలుగులో విడుద‌ల‌వుతుంటాయి. ఈయ‌నకు హైద‌రాబాద్‌కు చెందిన న‌టి అనీశారెడ్డికి మార్చిలో నిశ్చితార్థం జ‌రిగింది.

అయితే కొన్నిరోజుల త‌ర్వాత అనీశా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఎంగేజ్‌మెంట్ ఫొటోల‌ను తొల‌గించ‌డంతో..ప‌లు రూమ‌ర్స్ క్రియేట్ అయ్యాయి. విశాల్‌, అనీశా రెడ్డిల పెళ్లి ఆగిపోయింద‌ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డ్డాయి.  అయితే సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వ‌మ‌ని విశాల్ తండ్రి, సీనియ‌ర్ నిర్మాత జి.కె.రెడ్డి తెలిపారు.

ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన జి.కె.రెడ్డి విశాల్‌, అనీశారెడ్డి పెళ్లి జ‌రుగుతుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను కోర్టు పెండింగ్‌లో పెట్టింద‌ని, ఆ ఫ‌లితాల్లో విశాల్ టీమ్ విజ‌యం సాధిస్తుంద‌ని, త‌ర్వాతే న‌డిగ‌ర్ సంఘం బిల్డింగ్ పూర్తి చేసి అందులోనే విశాల్ పెళ్లి చేసుకుంటాడ‌ని తెలిపారు. అయితే పెళ్లి డేట్ ఫిక్స్ కాలేద‌ని, పెళ్లి తేదీ ఫిక్స్ కాగానే.. తెలియ‌జేస్తామ‌ని తెలిపారు జి.కె.రెడ్డి.

Get Breaking News Alerts From IndiaGlitz