close
Choose your channels

56 మందితో బీజేపీ నాలుగో జాబితా విడుదల..

Friday, November 20, 2020 • తెలుగు Comments

56 మందితో బీజేపీ నాలుగో జాబితా విడుదల..

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడంలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. నేడు నామినేషన్లకు తుది గడువు కావడంతో అభ్యర్థుల తుది జాబితా సిద్ధం చేసేందుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే విడతల వారీగా మూడు జాబితాల్లో కలిపి 73 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆపార్టీ.. 56 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా 129 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించినట్లయింది. ఈ క్రమంలోనే తుది జాబితాను సైతం మరికొద్ది సేపట్లో విడుదల చేసే అవకాశం ఉంది.

బీజేపీ నాలుగో జాబితాలోని అభ్యర్థులు వీరే..

కాప్రా - వినోద్‌, డా.ఎ.బి రావు నగర్‌ - ఎం. చంద్రిక, చర్లపల్లి - సరేందర్‌గౌడ్‌, మీర్‌పేట హెచ్‌.బి.కాలనీ - బంగి జయలక్ష్మి, మల్లాపూర్‌ - మల్లికార్జున్‌ గౌడ్‌, నాచారం - అనితా పద్మారెడ్డి, చిలకానగర్ ‌- శైలజా శ్రీకాంత్‌, హబ్సిగూడ - చేతన హరీశ్‌, ఉప్పల్‌ - డా.శిల్పారెడ్డి, వనస్థలిపురం - వెంకటేశ్వర్‌రెడ్డి, హస్తినాపురం - సుజాత, మూసారాంబాగ్ ‌- బి.భాగ్యలక్ష్మి, ఓల్డ్‌ మలక్‌పేట - కనకబోయిన రేణుక, తలాబ్‌చాలం - కొత్తపల్లి రేణుక, గౌలిపురా - ఆలె భాగ్యలక్ష్మి, సంతోష్‌నగర్ ‌- యశ్వంత్‌జైశ్వాల్‌, బార్కాస్‌ - వై.విజయలక్ష్మి, ఫలక్‌నామా - గగులోత్‌ మహేందర్‌, నవాబ్‌సాహెచ్‌ కుంట - ప్రజ్వల గౌడ్‌, జహానుమా - ఎ.శ్రీహరి, కిషన్‌బాగ్‌ - బందర్‌ నవీన్‌కుమార్‌, రాజేంద్రనగర్ ‌- అర్చన, అత్తాపూర్‌ - సంగీత, వెంగళరావునగర్ ‌- కె.మనోహర్‌, ఎర్రగడ్డ - ప్రసన్న, భారతీనగర్‌- జి.అంజిరెడ్డి, రమచంద్రాపురం - జి.సత్యనారాయణ, పటాన్‌చెరు - ఆశీష్‌ గౌడ్‌, కేపీహెచ్‌బీ కాలనీ - ప్రీతం రెడ్డి, బాలాజీనగర్‌ - అరిటాకుల చారుమతి, అల్లాపూర్‌ - పులిగోళ్ల లక్ష్మి యాదవ్‌, మూసాపేట్‌ - మహేందర్‌, ఫతేనగర్‌ - కృష్ణగౌడ్‌, ఓల్డ్‌బోయినపల్లి - తిరుపతి యాదవ్‌, బాల్‌నగర్‌ - నర్సిరెడ్డి, కూకట్‌పల్లి - నాయిని పవన్‌, గాజులరామారం - శ్రీధర్‌వర్మ, జగద్గిరిగుట్ట - శ్రీమహేష్‌ యాదవ్‌, రంగారెడ్డినగర్‌ - నందనం దివాకర్‌, చింతల్‌ ‌- పి.శ్రుతి, సూరారం - బక్కా శంకర్‌రెడ్డి, సుభాష్‌నగర్‌ - మాలతిరెడ్డి, కుత్బుల్లాపూర్‌ - ఉక్కంటి స్వాతి, జీటిమెట్ల - తారా చంద్రారెడ్డి,మచ్చబొల్లారం - సర్వే నరేష్‌, అల్వాల్‌ - కె.వీణా గౌడ్‌, వెంకటాపురం - జి.శివ అభిషేక్‌, నేరేడ్‌మెట్‌ - ప్రసన్న, వినాయక్‌నగర్‌ - సి.రాజ్యలక్ష్మి, బన్సీలాల్‌పేట - స్పందన, మౌలాలీ - సునీత శేఖర్‌యాదవ్‌, ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ - బక్కా నాగరాజ్‌, మల్కాజ్‌గిరి - వి.శ్రావణ్‌, గౌతంనగర్‌ - సంతోషి శ్రీనివాస్‌ ముదిరాజ్‌.

Get Breaking News Alerts From IndiaGlitz