close
Choose your channels

21 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

Thursday, November 19, 2020 • తెలుగు Comments

21 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ పోరు టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే అని తెలుస్తోంది. దీంతో అభ్యర్థుల జాబితా నుంచి ప్రతి అడుగూ ఇరు పార్టీలు చాలా జాగ్రత్తగా వేస్తున్నాయి. దుబ్బాక విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ తమ పార్టీ విజయం కోసం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తాజాగా బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 21 మంది అభ్యర్థులను బీజేపీ నేతలు ఖరారు చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

బీజేపీ అభ్యర్థులు వీరే:

ఫత్తర్‌గట్టి- అనిల్ బజాజ్

మొఘల్‌పురా- సి.మంజుల

పురానాపూల్-కొంగర సుందర్ కుమార్

కార్వాన్ -కట్ల అశోక్

లంగర్ హౌస్- సుగంధ పుష్ప

టోలిచౌకి-రోజా

నానల్ నగర్-కరణ్ కుమార్.కె

సైదాబాద్-కె. అరుణ

అక్బర్‌బాగ్- నవీన్ రెడ్డి

డబీర్‌పురా-మిజ్రా అఖిల్ అఫన్డి

రెయిన్ బజార్- ఈశ్వర్ యాదవ్

లలిత్‌బాగ్-ఎమ్.చంద్రశేఖర్

కూర్మగూడ-ఉప్పల శాంత

ఐఎస్ సదన్-జంగం శ్వేత

రియాసత్‌నగర్- మహేందర్ రెడ్డి

చంద్రాయణగుట్ట-జె.నవీన్ కుమార్

ఉప్పుగూడ-తాడెం శ్రీనివాసరావు

గౌలిపురా-ఆలె భాగ్యలక్ష్మి

శాలిబండ-వై. నరేశ్

దూద్‌బౌలి-నిరంజన్ కుమార్

ఓల్డ్ మలక్‌పేట-కనకబోయిన రేణుక

Get Breaking News Alerts From IndiaGlitz