తిరుమల కల్తీ నెయ్యి.. నలుగురు అరెస్ట్


Send us your feedback to audioarticles@vaarta.com


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై నమోదైన కేసులో సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో సిట్ అధికారులు నలుగుర్ని అరెస్ట్ చేశారు.
రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీవైష్ణవి డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డెయిరీ ఎండీ డా. రాజు రాజశేఖరన్ ను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్ట్ చేసిన వెంటనే వీళ్లను రాత్రికిరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 20వ తేదీ వరకు వాళ్లకు జ్యూడీషియల్ రిమాండ్ విధించారు జడ్జి. ఈ కేసుకు సంబంధించి తొలి చర్యలు ఇవే.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సెప్టెంబర్ 25న తిరుపతిలో కేసు నమోదైంది.
సిట్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఏఆర్ డెయిరీ పేరిట శ్రీవైష్ణవి డెయిరీ ప్రతినిధులే నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్టు కనిబెట్టారు. తమ దగ్గర చాలినంత వసతులు లేకపోయినా, సరైన అనుమతులు ఉన్నట్టు చూపించి అక్రమంగా టెండర్ దక్కించుకున్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com