close
Choose your channels

‘ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్’.. కామన్ పాయింట్ గుర్తించారా?

Saturday, January 30, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్’కి సంబంధించి ఓ కామన్ పాయింట్ ఉంది. ఈ కామన్ పాయింట్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలే. సినిమాలే అంచనాలు సైతం భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ సినిమాలు మూడూ.. నెలలు వేరైనా విడుదలయ్యే తేదీ మాత్రం ఒకటే కావడం విశేషం. మరి ఆ తేదీ ఏంటి? దాని వెనుక ఏమైనా మతలబు ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. నెలలు వేర్వేరైనా.. ఈ మూడు సినిమాలూ విడుదలయ్యే తేదీలు మాత్రం 13 కావడం గమనార్హం.

ముందుగా ‘ఆచార్య’ వస్తోంది..

ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్‌ల విషయానికి వస్తే ముందుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’ విడుదల కానుంది. ఈ సినిమా మే 13న విడుదల కానుంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ భారీ హిట్ కొట్టబోతున్నట్టు చెప్పకనే చెప్పేసింది. సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉందని దర్శకుడు కొరటాల శివ తెలిపారు. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇండిపెండెన్స్‌ డే కానుకగా పుష్ప..

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆగస్ట్ 13ను టార్గెట్ చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్ 13న బన్నీ నటించిన ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతకు మునుపెన్నడూ కనిపించని లుక్‌లో బన్నీ ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఊర మాస్ లుక్‌లో బన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్యాన్ ఇండియా మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. హైదరాబాద్‌ షెడ్యూల్‌ ముగిసిన వెంటనే... కేరళలో ఓ భారీ షెడ్యూల్‌ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దసరా కానుకగా ‘ఆర్ఆర్ఆర్’..

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం. 'బాహుబలి' సిరీస్‌ల భారీ విజయం తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య భారీ బ‌డ్జెట్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మెగా, నందమూరి హీరోల కలయికలో మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీగా వస్తోంది. ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరో కామన్ పాయింట్ ఇదే..

మొత్తానికి ఈ మూడు సినిమాల విషయంలో కామన్ పాయింట్ మాత్రం 13వ తేదీ. అయితే ఈ తేదీ వెనుక ఎలాంటి మతలబూ లేదని తెలుస్తోంది. అనుకోకుండా ఈ చిత్రాలు వేర్వేరు నెలల్లో ఒక తేదీని విడుదల కోసం ఫిక్స్ చేసుకున్నాయి. అలాగే అల్లు అర్జున్ మాత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ మూడు సినిమాల్లో మరో కామన్ పాయింట్.. ఈ మూడు చిత్రాల్లోనూ మెగా హీరోలు నటిస్తుండటం. అయితే ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొడతాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఈ మూడు సినిమాల్లో ఏది టాప్‌లో ఉంటుందనేదే ఆసక్తికరంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.