close
Choose your channels

ప్ర‌భాస్ చిత్రంతో అమితాబ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

Wednesday, October 14, 2020 • తెలుగు Comments

ప్ర‌భాస్ చిత్రంతో అమితాబ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

ప్యాన్‌ ఇండియా స్టార్‌ పభాస్‌ 21వ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీదత్‌ నిర్మాతగా 'మహానటి' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను వరల్డ్‌ మూవీగా తెరకెక్కిస్తానని నాగ్‌ అశ్విన్‌ ప్రారంభంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగా సినిమాలో ప్యాన్‌ ఇండియా స్టార్స్‌ అందరినీ ఒకచోట చేరుస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అమితాబ్ పాత్ర పూర్తిస్థాయిలో ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా క్లారిటీ ఇచ్చిన సంగ‌తి కూడా తెలిసిందే.

కాగా... ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తున్నందుకు దీపికా ప‌దుకొనెకు రూ.15కోట్లకు పైగా రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు అమితాబ్‌బ‌చ్చ‌న్‌కు నిర్మాత అశ్వినీద‌త్ ఎంత రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌నే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. అయితే దీనికి త‌గిన‌ట్లు సోష‌ల్ మీడియాలో అమితాబ్ పాత్ర పూర్తిస్థాయి ఉన్న‌ప్ప‌టికీ మొత్తంగా చూస్తే పాత్ర నిడివి 25 నిమిషాలు ఉంటుంద‌ని, అందుకోసం పాత్ర తీరు తెన్నుల‌ను వివ‌రిస్తూ మెయిల్‌ను అమితాబ్‌కు పంప‌గా..ఆయ‌న ఓకే చేశార‌ని.. ఈ పాత్ర కోసం ఆయ‌న‌కు పాతిక కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై మేక‌ర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz