close
Choose your channels

ప్రతిపక్షాల నిరసనల నడుమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..

Monday, February 1, 2021 • తెలుగు Comments

ప్రతిపక్షాల నిరసనల నడుమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..

ప్రతిపక్షాల నిరసనల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను నేడు ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ ఓజ్లా నల్లటి దుస్తుల్లో వచ్చారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. రైతులకు మద్దతుగా నల్ల దుస్తుల్లో ఆయన రావడం గమనార్హం. తొలిసారి పేపర్‌లెస్ బడ్జెట్‌ను నిర్మల ప్రవేశ పెట్టారు. ట్యాబ్‌లో చూసి బడ్జెట్‌‌ను చదివేశారు. కేంద్ర బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు యత్నించాయి. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ వల్ల అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నామన్నారు. ఐదు ప్యాకేజీలు ఐదు బడ్జెట్‌లతో సమానమని నిర్మల తెలిపారు. పీఎం గరీబ్ యోజన పేదలకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. కోవిడ్‌ యోధులందరికీ నిర్మలా సీతారామన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనాతో ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధిపై ప్రభావం పడిందన్నారు. ఆర్థికాభివృద్ధికి వ్యాక్సినేషన్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడు కరోనా తర్వాత కూడా మనం మరో కొత్త ప్రపంచంలో ఉన్నామన్నారు. దేశం మూలాల్లోనే ఆత్మనిర్భర్‌ భావం ఉందని నిర్మల పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం కృష్టి చేస్తామన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz