close
Choose your channels

బన్నీని కలిసేందుకు సరికొత్త మార్గం ఎంచుకున్న అభిమాని..

Tuesday, September 22, 2020 • తెలుగు Comments

బన్నీని కలిసేందుకు సరికొత్త మార్గం ఎంచుకున్న అభిమాని..

అభిమాన హీరోని కలుసుకునేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడో యువకుడు. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టాడు. మాచర్లకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. బన్నీని కలిసి ఫోటీ దిగిన అనంతరమై తిరిగి మాచర్లకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో పాదయాత్ర చేస్తున్నాడు. ఈ నెల 17న మాచర్ల నుంచి నాగేశ్వరరావు హైదరాబాద్‌కు బయలుదేరాడు.తన అభిమాన హీరోను కలవటానికే పాదయాత్ర చేస్తున్నానని తెలిపాడు. బన్నీ తొలి సినిమా గంగోత్రి నుంచే అల్లు అర్జున్‌పై అభిమానం పెరిగిందని నాగేశ్వరరావు తెలిపాడు

‘‘17వ తేదీన ఉదయం 8 గంటలకు పాదయాత్ర చేపట్టానని.. మంగళవారం సాయంత్రానికి అల్ర్జున్ ఇంటికి చేరుకుంటా. అన్న బిజీగా ఉండొచ్చు కానీ ఖాళీగా ఉన్న సమయంలో పిలిపిస్తాడేమోనని చిన్న ఆశ. గంగోత్రి సమయం నుంచి చూడాలని ఆశ. గతేడాదికి ముందు ఏడాది అన్న బర్త్ డే రోజున గీతా ఆర్ట్స్ దగ్గరకు వచ్చా. ఆ రోజు బాగా వర్షం పడింది... ఆరోజు దగ్గర నుంచి అన్నను చూశా. అప్పుడే అనుకున్నా అన్నను కచ్చితంగా కలవాలని.

నాలుగైదు సార్లు ట్రై చేశా.. కానీ కలవలేకపోయా. అందుకని పాదయాత్ర చేపట్టా. ఇది చూసైనా అన్న నా భుజంపై చెయ్యి వేసి ఫోటో తీసుకుని ఒక్క రెండు నిమిషాలైనా అన్నతో మాట్లాడాలని ఆశ’’ అని నాగేశ్వరరావు తెలిపాడు. ఫ్లెక్సీ పట్టుకుని రోడ్డుపై నడుస్తూ నాగేశ్వరరావు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. మరి నాగేశ్వరరావు విషయం బన్నీ దృష్టికి వెళుతుందో లేదో చూడాలి. ఈ సారైనా అతని ఆశ ఫలిస్తుందో.. లేదంటే నిరాశగా వెనుదిరుగుతాడో వేచి చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz