close
Choose your channels

చంద్రబాబు అత్యంత ఆప్తుడు, మాజీ ఎంపీ శివ ప్రసాద్ కు తీవ్ర అస్వస్థత!

Thursday, September 19, 2019 • తెలుగు Comments

చంద్రబాబు అత్యంత ఆప్తుడు మాజీ ఎంపీ శివ ప్రసాద్ కు తీవ్ర అస్వస్థత!

టీడీపీ అధినేత చంద్రబాబు ఆప్తుడు, మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఈ మధ్యే కోలుకున్నారని కుటుంబ సభ్యులు మీడియా తెలిపారు. అయితే గురువారం మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం తిరుపతి నుంచి ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అపోలోలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

చెన్నైకి చంద్రబాబు!

శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న బాబు.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారని సమాచారం. రేపు సాయంత్రం లేదా.. ఎల్లుండి ఉదయం చంద్రబాబు చెనై వెళ్లి పరామర్శిస్తారని తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. బాబుతో పాటు పలువురు ముఖ్యనేతలు చెన్నై వెళ్తారని సమాచారం.

గత ఎన్నికల్లో పరాజయం!

కాగా.. చంద్రబాబు-శివప్రసాద్ ఇద్దరూ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకే చోట చదువుకోవడంతో పాటు పొలిటికల్ ఎంట్రీ ఒకేసారి ఇచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. అలా చంద్రబాబు అధినేత స్థాయికి చేరుకోగా... ఎంపీతో పాటు పలు పదవులను శివప్రసాద్ అధిరోహించారు. 2009, 2014లో ఆయన చిత్తూరు ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో శివప్రసాద్ పరాజయం పాలయ్యారు.

అప్పట్లో హాట్ టాపిక్..!

ఇదిలా ఉంటే.. స్వతహాగా నటుడైన శివప్రసాద్ తన నిరసనలను కూడా అదే రీతిలో తెలపడం మనమంతా పేపర్లు, టీవీల్లో చూసేఉంటాం. ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదా ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలంటూ పార్లమెంట్ ముందు రకరకాల వేషధారణల్లో ఆయన నిరసన తెలిపారు. దీంతో ప్రాంతీయ మీడియానే కాకుండా జాతీయ మీడియాలోనూ అప్పట్లో శివప్రసాద్ హాట్ టాపిక్ అయ్యారు.

Get Breaking News Alerts From IndiaGlitz