close
Choose your channels

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న డ‌స్కీ బ్యూటీ..ఎవ‌రితో జ‌త క‌డుతుందో తెలుసా?

Sunday, January 19, 2020 • తెలుగు Comments

బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న డ‌స్కీ బ్యూటీ..ఎవ‌రితో జ‌త క‌డుతుందో తెలుసా?

టాలీవుడ్‌లో అంతంత మాత్రంగా అవ‌కాశాల‌తో స‌త‌మ‌వుతూ వ‌చ్చిన డ‌స్కీ బ్యూటీ ఈషారెబ్బాకు పెద్ద అవ‌కాశ‌మే ద‌క్కింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు ఈమె బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైంది. స‌మాచారం మేర‌కు అనిల్ క‌పూర్ త‌న‌యుడు.. హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ సోద‌రుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ బాలీవుడ్ రంగ ప్ర‌వేశం చేస్తున్నాడు. ఈ యువ క‌థానాయ‌కుడితో క‌లిసి ఈషా రెబ్బా న‌టించ‌నుందట‌. జాతీయ అవార్డ్ ద‌క్కించుకున్న స్క్రీన్‌ప్లే రైట‌ర్ రాజ్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్న‌ట్లు టాక్‌. ఈషా రెబ్బా రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి ఆడిష‌న్ ఇచ్చింద‌ట‌. గ‌త చిత్రాల్లో ఈషా వ‌ర్క్ న‌చ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను హీరోయిన్‌గా తీసుకోవ‌డానికి ఓకే అయ్యార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.

మ‌హిళా సాధికార‌త అనే పాయింట్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఈషారెబ్బా రాజ‌స్థానీ అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఎమోష‌న‌ల్‌గా సాగే పాత్ర‌కు ఈషారెబ్బా న్యాయం చేస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు న‌మ్మార‌ట‌. తెలుగులో `రాగ‌ల 24 గంట‌ల్లో` చిత్రంలో మెయిన్ లీడ్‌గా న‌టించిన ఈషా రెబ్బాకు ఇదొక మంచి అవ‌కాశమ‌నే చెప్పొచ్చు. 

Get Breaking News Alerts From IndiaGlitz