close
Choose your channels

త‌ప్పుడు వార్త‌లు రాయొద్దంటూ అషూరెడ్డి వార్నింగ్‌

Sunday, March 7, 2021 • తెలుగు Comments

త‌ప్పుడు వార్త‌లు రాయొద్దంటూ అషూరెడ్డి వార్నింగ్‌

కొన్ని రోజుల ముందు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఆయ‌న అభిమాని అయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి క‌లిసింది. ఆఫొటోను సోష‌ల్ మీడియాలో చేసింది. అయితే దీనిపై ... ఓ చాటింగ్‌లో అభిమానుల‌తో ప‌‌వ‌న్‌క‌ల్యాణ్‌కు నాలుగో భార్య‌గా ఉంటావా? అని ప్ర‌శ్నించిన‌ప్పుడు ఆషూరెడ్డి ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేశాయి. దీనిపై ఇప్పుడు ఆషూ రెడ్డి స్పందించింది. నేను ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు పెద్ద అభిమానిని. ఆయ‌న‌కు ఎప్పటికీ అభిమానిగానే ఉంటాను. ద‌య‌చేసి త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించ‌వద్దు అని చెబుతూ ఇన్‌స్టా వీడియోలో ఆమె వార్నింగ్ ఇచ్చారు.

‘‘పవన్‌క‌ల్యాణ్‌గారు నాకు దేవుడితో స‌మానం. ఈ మ‌ధ్య కొంద‌రు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు. ఆయ‌న‌కు నేను పెద్ద అభిమానిని. చ‌చ్చేంత వ‌ర‌కు ఆయ‌న అభిమానిగానే ఉంటాను. అభిమానం అంటే అభిమానినే. దాన్ని వేరేలా చిత్రీక‌రిస్తూ కొంద‌రు పిచ్చిగా రాస్తున్నారు. మరొక‌రి పేరుని పాడు చేయ‌డం మంచిది కాదు. దీని వ‌ల్ల చాలా మంది మ‌నోభావాలు దెబ్బ తింటాయి. ఇలాంటి ప‌నులు వ‌ల్ల‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అభిమానులను క‌లుసుకోవాలంటే ఆలోచించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. నాకు ఓపిక న‌శించి ఇస్తున్న వీడియో ఇది. నేను ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేదు’’ అని వార్నింగ్ వీడియో ఇస్తూ వివ‌ర‌ణ కూడా ఇచ్చింది ఆషూ రెడ్డి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz