భయం వద్దు.. ఇది రైతుల ప్రభుత్వం: చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ రైతులకు పూర్తిస్థాయిలో హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కూటమి సర్కారు రైతులకు పూర్తి అనుకూలమైన ప్రభుత్వమని, చిన్నా-పెద్ద తేడా లేకుండా ప్రతి రైతును ఆదుకుంటామని అన్నారు.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యతను కూటమి సర్కారు తీసుకుంటుందని, ప్రతి రైతుకు 20వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. దీంతో పాటు పీఎం కుసుమ్ పథకం కింద వ్యవసాయ పంపు సెట్లు కూడా అందిస్తామన్నారు.
వైద్యసేవ పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. తాజాగా రిలీజ్ చేసిన బడ్జెట్ లో ఎస్సీ,బీసీ, రైతులకు ఎక్కువగా కేటాయింపులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా జనాభాపై మరోసారి స్పందించారు చంద్రబాబు. ప్రపంచ జనాభా తగ్గిపోతోందని, ప్రపంచం ముసలిదైపోతోందని, దంపతులు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com