తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ


Send us your feedback to audioarticles@vaarta.com


వేసవి వచ్చింది, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ పంచాయతీ మొదలైంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటాలు మిగిలి ఉన్నాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తేల్చింది. జూన్, జూలై నెలల్లో తలెత్తే నీటి ఎద్దటిని తట్టుకునే ప్రణాళికలు సమర్పించాలని ఇరు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సూపరింటెండింగ్ ఇంజనీర్ జి.వరలక్ష్మీ ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు లేఖ రాశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు జరపాలని గత జనవరి 21న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించిన విషయాన్ని కృష్ణా బోర్డు గుర్తు చేసింది. కృష్ణా బేసిన్లో 1010.134 టీఎంసీల జలాలు లభ్యతలోకి రాగా తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీకి 666.68 టీఎంసీలు, తెలంగాణకు 343.44 టీఎంసీల వాటాలుంటాయని పేర్కొంది.
తమ వాటా నుంచి ఏపీ ఇప్పటికే 639.652 టీఎంసీలు వాడుకోగా, ఆ రాష్ట్ర కోటాలో 27.03 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ 211.691 టీఎంసీలు వాడుకోగా, మరో 131.75 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లెక్క గట్టింది. పోతిరెడ్డిపాడు నుంచి 207 టీఎంసీలు తరలించిన ఏపీ, గతేడాది నవంబర్ 25న 15.86 టీఎంసీలు, గత జనవరి 31న మరో 18 టీఎంసీలు కలిపి మొత్తం 33.86 టీఎంసీలను నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు విడుదల చేయాలని ఏపీ కోరినట్టు కృష్ణా బోర్డు తెలిపింది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఈ ఏడాది ఏపీ రికార్డు స్థాయిలో 207.88 టీఎంసీ జలాలను తరలించుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ మొత్తం 236.63 టీఎంసీలను తరలించుకోగా, తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల అవసరాలకు కేవలం 34 టీఎంసీలను మాత్రమే తరలించుకోగలిగింది. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వలు, కృష్ణా డెల్టా సిస్టమ్‌కు కలిపి మరో 324.2 టీఎంసీలను ఏపీ వాడుకుంది.
నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం 510 అడుగులకి పైన 63.6 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 834 అడుగులకి పైన 30.811 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయని కృష్ణా బోర్డు స్పష్టం చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments