close
Choose your channels

'నిశ్శబ్దం' లో మాధవన్ - అనుష్క శెట్టి మధ్య కెమిస్ట్రీ గురించి చెప్పిన డైరెక్టర్ హేమంత్ మధుకర్

Tuesday, September 29, 2020 • తెలుగు Comments

నిశ్శబ్దం లో ఆర్ మాధవన్ మరియు అనుష్క శెట్టి ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా పండిందో వెల్లడించిన దర్శకుడు హేమంత్ మధుకర్

ఎంతో కాలం తరువాత ఆర్ మాధవన్ మరియు అనుష్క శెట్టిలను జంటగా చూడడం అభిమానులకు, వీక్షకులకు ఉత్కంఠను రేకెత్తించేందిగా మారింది. ఈ జంట చివరిసారిగా తమిళ చిత్రం రెండు లో దర్శనమిచ్చింది. 14 ఏళ్ళ తరువాత మరోసారి ఈ జంట తెరపై కనువిందు చేయనుంది. అందుకే అంతా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోపై  తెలుగు – తమిళం థ్రిల్లర్ నిశ్శబ్దం కో సం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ముచ్చట సందర్భంగా డైరెక్టర్ హేమంత్ మధుకర్  ఈ సినిమాలో అ నుష్క మరియు మాధవన్ లు తిరిగి జోడీ కట్టడంపై ఓ ఆసక్తిదాయక విశేషం వెల్లడించారు. అది ఈ థ్రిల్లర్ లో మునిగిపోయే వీ క్షకులకు ఓ బోనస్ లాంటిది. 

‘‘వారిద్దరూ కలసి గతంలోనే ఓ చిత్రంలో నటించారని, వారు 14 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసనే విషయం మొదట నాకు తెలి యదు. మూగ యువతి పాత్ర పోషించేందుకు అనుష్క కనబర్చిన ఉద్వేగం మరియు గాయకుడి పాత్ర పోషించేందుకు మాధవ న్ కనబర్చిన ఆసక్తి నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఒకరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. మరొకరు ఎంతో అందంగా ఉంటారు. జంటగా చూడముచ్చటగా ఉంటారు. అది తెరపై చక్కటి కెమిస్ట్రీని పండించింది. ఇంతకుముందు కలసి నటించని వారితో పని చేస్తుంటే  వారిని డైరెక్ట్ చేయడం కష్టంగా ఉంటుంది. అనుష్క, మాధవన్ లు మాత్రం ఎంతో సహజంగా నటించారు మరియు నే ను ఆశించిన దాని కన్నా మరింతగా వారి మధ్య కెమిస్ట్రీ పండింది’’ అని దర్శకుడు హేమంత్ మధుకర్ అన్నారు.

నిశ్శబ్దం లో ఆర్ మాధవన్ మరియు అనుష్క శెట్టి ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా పండిందో వెల్లడించిన దర్శకుడు హేమంత్ మధుకర్

కొంత కాలం క్రితం విమానంలో వెళ్తున్న సందర్భంలో సినిమాలో సాక్షి పాత్ర కోసం అనుష్కను నిర్మాత కోన వెంకట్ ఖాయం చేశారు. ‘‘నిజానికి సాక్షి పాత్ర కోసం మొదట్లో నా మనస్సులో వేరే వాళ్లు ఉన్నారు. విమాన ప్రయాణ సందర్భంలో కోన వెంకట్అనుష్కను కలుసుకున్నారు. ఆ పాత్రకు ఆమెను మించిన మెరుగైన ఎంపిక మరొకటి ఉండదని నాకు నచ్చచెప్పారు. అనుష్క, మాధవన్ లను మళ్లీ కలిపినందుకు, ఒక అద్భుత కళాఖండం అందిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది’’ అని అన్నారు. 

మాటలు రాని, చెవులు వినబడని  ప్రతిభావంతురాలైన సాక్షి కథనే నిశ్శబ్దం. ఓ విల్లా లో చోటు చేసుకున్న ఓ విషాద సంఘ టనకు ఆమె ఊహించన విధంగా సాక్షి అవుతుంది. పోలీస్ డిటెక్టివ్ ల జట్టు ఆ కేసు మిస్టరీ విప్పేందుకు ప్రయత్నిస్తుంటుంది. దయ్యం మొదలుకొని తప్పిపోయిన యువతి దాకా అంతా వారి అనుమానితుల జాబితాలో ఉంటారు. నిశ్శబ్దం సినిమా మీరు మీ మునివేళ్లపై కూర్చునేలా చేసే థ్రిల్లర్. ఆ తరువాత ఏం జరుగుతుందా అని వీక్షకులకు ఉత్కంఠ కలిగిస్తుంది.  

దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం సినిమా టీజీ విశ్వప్రసాద్ చే నిర్మించబడింది. అనుష్క షెట్టి, ఆర్ మాధవన్, అంజలి ప్రధాన పాత్రల్లో నటించారు. అమెరికా నటుడు మైఖేల్ మాడ్సన్ ఓ భారతీయ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

భారత్ మరియు 200కు పైగా దేశాలు, టెరిటరీస్ లలో ప్రైమ్ సభ్యులు ఈ తెలుగు థ్రిల్లర్ నిశ్శబ్దం (తమిళం, మలయాళం లో దీని పేరు సైలెన్స్) ను అమెజాన్ ప్రైమ్ వీడియోపై అక్టోబర్ 2 నుంచి చూడవచ్చు.

Get Breaking News Alerts From IndiaGlitz