close
Choose your channels

ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసిన అనీల్‌ రావిపూడి

Monday, March 8, 2021 • తెలుగు Comments

ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసిన అనీల్‌ రావిపూడి

ఐదు సినిమాలు చేసి వరుస సక్సెస్‌లను సొంతం చేసుకుని స్టార్‌ డైరెక్టర్‌గా మారిన అనీల్‌ రావిపూడి. ఇప్పుడు నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ నిర్మిస్తోన్న చిత్రం 'గాలి సంపత్‌' ఈ నెల 11న విడుదల కానుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, అనీల్‌ రావిపూడి ఇప్పుడు స్టార్‌ హీరోలను డైరెక్ట్‌ చేసే రేంజ్‌కు చేరుకున్నాడు. పటాస్‌ సినిమాతో దర్శకుడిగా మారిన అనీల్ తర్వాత సుప్రీమ్‌, రాజాది గ్రేట్‌, ఎఫ్‌2, సరిలేరు నీకెవ్వరు చిత్రాలను తెరకెక్కించారు. అన్నీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ను బాగానే రాబట్టాయి. ఇప్పుడు మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్స్‌ లిస్టులో అనీల్‌ రావిపూడి చేరాడు. ఇప్పుడు డైరెక్టర్‌గా అనీల్‌ రావిపూడి పది కోట్ల రూపాయల మేరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటాడు. ఇప్పుడు తను డైరెక్ట్‌ చేసిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ఎఫ్‌2 సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్‌3 సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు.

స్టార్‌ డైరెక్టర్‌గా మంచి రెమ్యునరేషన్‌ను రాబట్టుకుంటున్న అనీల్ రావిపూడి.. హైదరాబాద్‌ కొండాపూర్‌ ప్రాంతంలో ఖరీదైన విల్లాను కొన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ విల్లా ఖరీదు పన్నెండు కోట్ల రూపాయలు. ప్రస్తుతం అనీల్‌ రావిపూడి.. ఈ విల్లాకు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ చేయిస్తున్నాడట. త్వరలోనే ఆ ఇంటికి ఫిష్ట్‌ అవుతాడని టాక్‌. సినిమాల విషయానికి వస్తే.. 'గాలి సంపత్‌' సినిమాను నిర్మించిన అనీల్‌ రావిపూడి, డైరెక్టర్‌గా ఎఫ్‌ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Get Breaking News Alerts From IndiaGlitz