close
Choose your channels

దిల్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఈమెనే.. ఫుల్ డీటైల్స్ ఇవీ..!

Monday, May 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దిల్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఈమెనే.. ఫుల్ డీటైల్స్ ఇవీ..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి నిజామాబాద్‌లోని వెంక‌టేశ్వర స్వామి దేవాలయం వేదికగా ఈ వేడుక జరిగింది. అతి కొద్ది బంధువులు సమక్షంలో దిల్ రాజు పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఉదయం దిల్ రాజు ప్రకటన కూడా చేశారు. తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని.. తాజా మలుపుతో వ్యక్తిగత జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే దిల్‌రాజు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు..? ఇంతకీ ఆమె తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తేనా కదా..? ఇంతకీ ఆమె ఏం పనిచేస్తుంది..? అనేదానిపై సినీ ప్రియులు, ఔత్సాహికులు ఎదురుచూస్తున్నారు.

ఇంతకీ ఎవరీమె..!?

మొదట ఎయిర్ హోస్టస్‌ను పెళ్లి చేసుకున్నాడని వార్తలు వినిపించాయ్.. ఆ తర్వాత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నట్లూ వార్తలొచ్చాయ్. ఇలా రకరకాలుగా పుకార్లు వస్తుండటంతో ఎట్టకేలకు దిల్ రాజ్ కాంపౌండ్ నుంచే వివరాలు బయటికి వచ్చాయి. ఆయన వివాహం చేసుకుంది తేజశ్వనీ అనే యువతిని. తేజశ్వనీ ఒరిజనల్ పేరు వైగా రెడ్డి అని వివరాలు బయటికొచ్చాయ్. కాగా.. దిల్ రాజు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్న విషయం విదితమే. ఆయన ఒరిజినల్ పేరు వి. వెంకట్రామిరెడ్డి. అంటే ఆయన పెళ్లి చేసుకున్నది కూడా అదే సామాజిక వర్గం అమ్మాయినే.. ఇదివరకు వచ్చిన పుకార్లన్నీ అబద్ధమే అన్న మాట. కాగా.. ఆ యువతి రాజుగారికి అత్యంత సన్నిహితుడైన ఓ మిత్రుడి సోదరి అని తెలిసింది. అయితే ఆమెకు సినీ ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయాల్లేవ్.

దిల్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఈమెనే.. ఫుల్ డీటైల్స్ ఇవీ..!

ప్రముఖుల విషెస్..!

వాస్తవానికి పెళ్లి అయిన కొన్ని గంటలకు గానీ.. దిల్ రాజు కాంపౌండ్ నుంచి సింగిల్ ఫొటో కూడా రిలీజ్ కాలేదు. అంతేకాదు.. ఆదివారం అర్ధరాత్రి పెళ్లయితే సోమవారం మధ్యాహ్నానికి ఫొటోలు విడుదల చేశారు. ప్రస్తుతం ఐదారు ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు రాజుగారికి విషెస్ చేశారు. అంతకు ముందు ఆయన కుమార్తె హన్సితా రెడ్డి కూడా విష్ చేసింది. ‘నాన్నా.. అన్ని సమయాల్లోనూ నువ్వు నాకు అతి పెద్ద బలంగా నిలిచావు. ఎప్పుడూ నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన కుటుంబ సంతోషమే నీకు అతి ముఖ్యమైనది. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజూ నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని హన్సితా రాసుకొచ్చింది.

దిల్ రాజ్ పెళ్లి చేసుకున్నది ఈమెనే.. ఫుల్ డీటైల్స్ ఇవీ..!

రిసిప్షన్ ఎప్పుడో..!?

కేవలం 15 మంది మధ్యే పెళ్లి చేసుకున్న దిల్ రాజు.. రిసెప్షన్ ఎప్పుడు ఇస్తాడో.. తన సతీమణిని ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, తన అత్యంత ఆప్తులకు.. మరీ ముఖ్యంగా మీడియాకు ఎప్పుడు పరిచయం చేస్తారా..? అని ఎంతో ఉత్సాహకంగా అభిమానులు వేచి చూస్తున్నారు. మరి కరోనా కష్టకాలం పోయిన తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ఉంటుందా..? లేకుంటే సింపుల్‌గానే తన ఇంట్లో పెద్దలకు మాత్రమే ఫంక్షన్ ఉంటుందా..? అనేది తెలియరాలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos