close
Choose your channels

నాగార్జున‌కు అంతా ముందే తెలుసా...

Saturday, July 20, 2019 • తెలుగు Comments

నాగార్జున‌కు అంతా ముందే తెలుసా...

నాగార్జున‌కు అంతా ముందే తెలుసా.. అత‌నికి ఆ విష‌యం ముందే ఉప్పందిందా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు సినీ జ‌నాలు. ఇంత‌కీ ఇంత ఆశ్చ‌ర్యం ఎందుకంటే రిలీజ్ డేట్ విష‌యంలో. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో నాగార్జున హీరోగా, ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా తెర‌కెక్కుతోన్న `మ‌న్మ‌థుడు2` విడుద‌ల విష‌యంలో. ఈ సినిమాను ఆగ‌స్ట్ 9న విడుద‌ల చేయ‌డానికి నాగ్ స‌న్నాహాలు చేశారు. `సాహో` 15న విడుద‌ల చేస్తార‌నుకున్న నేప‌థ్యంలో మ‌న్మ‌థుడు2 పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వినిపించాయి. వాట‌న్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ నాగ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆగ‌స్ట్ 9నే విడుద‌ల చేస్తున్న‌ట్టు క‌న్‌ఫ‌ర్మ్ చేశారు.

ఆయ‌న పోస్ట్ చేసిన కొన్నాళ్ల‌కు సాహో వాయిదా ప‌డింది. అంటే సాహో వీఎఫ్ ఎక్స్ ప‌నులు కొలిక్కి రాలేద‌ని, విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌ని నాగార్జున‌కు ముందే ఉప్పందిన‌ట్టే. ఆ న‌మ్మ‌కంతోనే ఆయ‌న విడుద‌ల తేదీ విష‌యంలో ముందు నుంచీ స్ట్రాంగ్‌గా ఉన్న‌ట్టు స‌మాచారం. ఆల్రెడీ టీజ‌ర్‌లోనే మాస్ మ‌సాలా లిప్ లాక్‌లు చూపించేసిన నాగ్ ఈ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి న‌టించార‌నీ టాక్ స్ప్రెడ్ అవుతుంది. దానికి త‌గ్గ‌ట్టు ర‌కుల్ కూడా ఇంత‌కు ముందు సినిమాల‌తో పోలిస్తే ఈ చిత్రంలో గ్లామ‌ర్ కోషెంట్ పెంచింద‌నే విష‌యం ఫొటోలు చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. తొలి సినిమాతో స‌క్సెస్ బోణీ చేసిన రాహుల్, ఇప్పుడు ఈ చిత్రంతో ద్వితీయ విఘ్నాన్ని దాటేయాల‌ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. సో అన్నీ క‌లిసొచ్చి మ‌న్మ‌థుడు2 హిట్ గ్యారంటీ అని నాగ్ స్ప‌ష్టంగా న‌మ్ముతున్నార‌ని స‌మాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz