close
Choose your channels

జయరాజ్, బెన్నిక్స్‌ల మరణంపై దియా మీర్జా ట్వీట్

Wednesday, July 1, 2020 • తెలుగు Comments

జయరాజ్, బెన్నిక్స్‌ల మరణంపై దియా మీర్జా ట్వీట్

జయరాజ్, బెన్నిక్స్‌ అనే వ్యక్తుల మరణంపై మిస్ ఏషియా, ప్రముఖ నటి దియా మీర్జా స్పందించారు. తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో జయరాజ్ అనే వ్యక్తి, అతని కుమారుడు బెన్నిక్స్‌(ఫెనిక్స్)ల మరణం సంచలనంగా మారింది. వీరిద్దరూ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ సాతంకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జయరాజ్, బెన్నిక్స్‌లు పోలీస్ కస్టడీలో మృతి చెందారు. దీనిపై తమిళనాడు మొత్తం అగ్గిమీద గుగ్గిలమైంది.

తమిళనాడు ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. నెటిజన్లు దీనిపై విస్తృతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో #JusticeForJayarajAndFenix అనే యాష్ ట్యాగ్‌తో విపరీతంగా తమిళవాసులు ట్వీట్లు చేశారు. తాజాగా జయరాజ్, బెన్నిక్స్‌లకు న్యాయం చేయాలంటూ దియా మీర్జా ట్వీట్ చేశారు. పోలీసులు చేసిన దారుణాన్ని ఆమె ఖండించారు.

Get Breaking News Alerts From IndiaGlitz