close
Choose your channels

'దిమాక్ ఖ‌రాబ్...' వీడియో సాంగ్ దూకుడు

Saturday, September 21, 2019 • తెలుగు Comments

దిమాక్ ఖ‌రాబ్... వీడియో సాంగ్ దూకుడు

`ఇస్మార్ట్ శంక‌ర్‌` ఈ సినిమాపై విడుద‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఎందుకంటే అటు హీరో రామ్‌కైనా.. ఇటు డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాథ్‌కైనా స‌క్సెస్‌లు లేవు. అయితే బంతి కింద ప‌డితే అలాగే పైకి లేస్తుంది. ఈ రీతిలోనే పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హిట్ కొట్టాడు. సినిమా చాలా హ్యూజ్ హిట్ట‌య్యింది. రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. పూరి టేకింగ్‌కి రామ్ ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్‌, హీరోయిన్స్ న‌భా న‌టేశ్‌, నిధి అగ‌ర్వాల్ గ్లామ‌ర్ తోడు కావ‌డంతో సినిమాకు మాస్ ఆడియెన్స్ మాంచి క్రేజ్ వ‌చ్చింది. సాంగ్స్ విష‌యానికి వ‌స్తే.. సినిమాలో పాట‌లు బావున్నాయని అన్నారు.

అంతేలా తెర‌పై కూడా ప్రేక్ష‌కులు ఆస్వాదించారు. ముఖ్యంగా దిమాక్ ఖ‌రాబ్ వీడియో సాంగ్‌కైతే ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సాంగ్‌ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ యూ ట్యూబ్‌లో విడుద‌ల చేసింది. యూ ట్యూబ్‌లోనూ ఈ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. సాంగ్ విడుద‌లైన 17 గంట‌ల్లోనే 3 మిలియ‌న్ వ్యూస్‌ను దాటేయ‌డం విశేషం. శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులు, రామ్‌, న‌భా, నిధి పెర్ఫామెన్సులు ఈ పాట‌కు మెయిన్ హైలైట్.

పూరి అంటే మాస్.. ఈ సినిమాలోనూ హీరో రామ్‌ను పూరి మాస్ యాంగిల్‌లో ఆవిష్క‌రించాడు. పూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు ఛార్మితో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Get Breaking News Alerts From IndiaGlitz