close
Choose your channels

చిరంజీవి, చ‌ర‌ణ్‌ల‌పై ఫిర్యాదు చేసిన ఉయ్యాల‌వాడ వార‌సులు

Saturday, September 21, 2019 • తెలుగు Comments

చిరంజీవి, చ‌ర‌ణ్‌ల‌పై ఫిర్యాదు చేసిన ఉయ్యాల‌వాడ వార‌సులు

మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌ల‌పై ఉయ్యాల‌వాడ వార‌సులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వివ‌రాల్లోకెళ్తే.. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తోన్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. అక్టోబ‌ర్ 2న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది.

అయితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఉయ్యాల‌వాడ వార‌సుల‌ను క‌లిసిన సినిమా యూనిట్ వారి కుటుంబంలో 23 మందికి 50 కోట్లు ఇస్తామ‌ని, దానికి ట్యాక్స్ కూడా తామే చెప్పిస్తామ‌ని చెప్పి ఇప్పుడు డ‌బ్బులు ఇవ్వ‌కుండా మోసం చేస్తున్నార‌న్నారు. ఈ విష‌యం అడ‌గ‌టానికి చిరంజీవి ఇంటికి వెళితే అక్క‌డ పోలీసుల‌తో అరెస్ట్ చేయించి త‌ప్పుడు కేసులు పెట్టార‌న్నారు ఉయ్యాల‌వాడ వార‌సులు. వార‌సుల‌మైన త‌మ నుండి ఉయ్యాల‌వాడ‌కు సంబంధించిన ఆధారాలు సేక‌రించి ఇప్పుడు త‌మపైనే త‌ప్పుడు కేసులు పెట్టార‌ని స‌ద‌రు వార‌సులు అంటున్నారు.

ఇప్ప‌టికే ఈ వివాదం ప‌లుసార్లు మీడియా దృష్టికి వచ్చింది. ఈ విష‌యాన్ని రామ్‌చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే.. ``సుప్రీమ్ కోర్టు తీర్పు ప్ర‌కారం వందేళ్లు దాటిన చ‌రిత్ర‌కారుడి జీవిత చ‌రిత్ర‌ను గౌర‌వ‌ప్ర‌దంగా ఎవ‌రైనా సినిమాగా తెరకెక్కించవ‌చ్చు. న‌ర‌సింహారెడ్డిగారు ఓ ప్రాంతం కోసం పోరాడిన వ్య‌క్తి. ఆయ‌న ప్రాంతం కోసం నేను ఏదైనా సాయం చేయ‌గ‌ల‌ను కానీ.. ఆయ‌న ఓ కుటుంబానికి ప‌రిమితం చేసి, త‌క్కువ  చేయ‌లేను`` అన్నారు రామ్‌చ‌ర‌ణ్‌. 

Get Breaking News Alerts From IndiaGlitz