close
Choose your channels

గోదారిలో ఘోర బోటు ప్రమాదం.. 254 అడుగుల లోతులో..!

Sunday, September 15, 2019 • తెలుగు Comments

తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. 54 మందితో పాపికొండలు నుంచి బయల్దేరిన టూరిజం బోటు బయలుదేరింది. అయితే పయనమైన కొద్దిసేపటికే గల్లంతయ్యింది. పోలవరం మండలం తూటిగుంట పంచాయతీ సమీపంలో తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. పోచమ్మ గండి నుంచి ఆదివారం ఉదయం సుమారు 75 మంది పర్యాటకులతో బయలుదేరిన వశిష్ట అనే టూరిజం బోటు బయల్దేరింది. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి వరద నీటి ప్రవాహానికి బోటు నీటమునిగింది. దీంతో లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉన్న 24 మంది వరద ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండటంతో తూటిగుంట గ్రామానికి చెందిన బోటు డ్రైవర్ భద్రం 24 మందిని కాపాడాడు. ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. వారి మృతదేహాలను వెలికి తీశారు.

ఎలా అనుమతిచ్చారు!?

దేవీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ముగ్గురు మరణించారు. మరో 51 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.. వారి ఆచూకీ తెలియవలసి ఉంది. గోదావరి వరద ప్రవాహం ఉదృతంగా ఉన్న నేపథ్యంలో పర్యాటక బోట్లకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అయితే పోచమ్మ గండి నుండి బయలుదేరిన బోటు దేవీపట్నం పోలీస్ స్టేషన్ మీదుగానే వెళ్ళవలసి ఉంటుంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న సందర్భాల్లో బోట్లకి అనుమతి లేని సందర్భంలో పోలీసులు.. ఆ బోటుని ఎలా అనుమతించారనే విషయాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి గురైన బోటు పర్యాటక శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని అధికారులు తేల్చారు.
రాయల్ వశిష్టకు చెందిన ప్రైవేటు బోటుగా అధికారులు గుర్తించారు. ఆ బోటు.. కోడిగుడ్ల వెంకటరమణ అనే ప్రైవేటు వ్యక్తిదని తెలిసింది. అయితే

ప్రాణాలతో చెలగాటం!

అనూహ్యమైన సంఘటన జరగడంతో ఇటు పోలవరం పోలీసులు, అటు తూర్పుగోదావరి జిల్లా పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుంటున్నారు. గత ఏడాది మే 15వ తారీఖున ఇదేవిధంగా లాంచీ మునిగిన సంఘటనలో వాడపల్లిలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 19 మంది మృతి చెందిన సంఘటన మరువక మునుపే మరో ఘటన జరగడం పట్ల, అనుమతులు లేకుండా బోట్లు నడుపుతూ పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బోట్ల యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అత్యంత లోతు ఇదే..
కాగా.. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో.. నదీ లోతు 250 అడుగులకు పైగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పడవ ప్రమాద సమయంలో గోదావరిలో 5 లక్షల క్యూసెక్కల వరద నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు. కాగా.. 2018 మే 16వ తేదీని పోలవరం మండలం వాడపల్లి వద్ద లాంచీ మునిగిన ఘనటలో 22 మంది మృతి చెందారు. అయితే మళ్లీ అలాంటి ఘటనే ఇప్పుడు జరగడంతో గోదావరి జిల్లాల ప్రజలనే కాకుండా.. తెలుగు రాష్ట్రాల ప్రజలను సైతం భయబ్రాంతులకు గురిచేస్తోంది.

జగన్ సీరియస్...
పడవ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఘటనపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని తూగో జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. అంతటితో ఆగని ఆయన.. తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..
తూర్పు గోదావరి జిల్లా పాపికొండల వద్ద లాంచీ ప్రమాదం జరగడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్!
ఇదిలా ఉంటే.. బోటు మునక ఘటనలో సహాయక చర్యల కోసం హుటాహుటిన రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను విపత్తుల నిర్వహణ శాఖ పంపింది. కాగా.. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 30 మంది సభ్యులు . ఒక్కో ఎస్డీఆర్ఎఫ్ బృందంలో 40 మంది సభ్యులు ఉంటారు.

Get Breaking News Alerts From IndiaGlitz