close
Choose your channels

Goat:వినాయకచవితి కానుకగా దళపతి విజయ్ 'గోట్' చిత్రం విడుదల

Thursday, April 11, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) 'గోట్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో AGS ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రం భారీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ అల్ టైం’ అనే టైటిల్‌ని గతంలో ప్రకటించారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన విజయ్ డ్యూయల్ రోల్ పోస్టర్ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాలో విజయ్ తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.

1971లో డిబి కూపర్ అనే వ్యక్తి విమానంలో భారీ దొంగతనానికి పాల్పడి గాలిలో విమానం నుంచి పారాచ్యుట్‌తో దూకేసాడు. అలా దూకిన వ్యక్తి ఇప్పటివరకు ఎవరికీ దొరకలేదు. అసలు అతను చనిపోయాడా.. లేక బతికితే ఇన్నాళ్లూ ఎక్కడ జీవించాడు అనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కథను బేస్ చేసుకుని ఈ సినిమాని తీస్తున్నారని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. మరి ఇంతవరకు నిజమో తెలియాలంటే మూవీ విడుదల వరకు ఆగాల్సిందే. తాజాగా విజయ్ అభిమానులకు మూవీ మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు.

వినాయక చవితి కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 5న ఈ సినిమాని తమిళ్, తెలుగు, హిందీలో రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 7 చవితి పండుగ కావడంతో సినిమాకి కలెక్షన్స్ పరంగా కలిసొస్తుందని ఈ డేట్‌ని ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే విజయ్ గత చిత్రాలు లియో, బీస్ట్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అలరించాయి. ముఖ్యంగా లోకేశ్ కనగరాజన్ దర్శకత్వంలో వచ్చిన లియో చిత్రం అయితే వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.500కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర విజయ్ స్టామినా ఏంటో నిరూపించింది. తెలుగులో కూడా దళపతి చిత్రాలకు మంచి వసూళ్లు వస్తున్నాయి.

మరోవైపు విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ఇప్పటికే పార్టీ పేరును కూడా ప్రకటించారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా విజయ్ రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అందుకే ఈలోపు కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీతో పాటు మరో చిత్రంలో మాత్రమే నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లు త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది నుంచి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారట. తమిళనాడు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చోవడమే లక్ష్యంగా విజయ్ పావులు కదుపుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.