close
Choose your channels

క్రేజీ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న ‘విరాట‌ప‌ర్వం’ డిజిట‌ల్ హ‌క్కులు

Wednesday, March 3, 2021 • తెలుగు Comments

నక్సలైట్.. రాజకీయ నాయకుడు రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తోన్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. రానా జోడీగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్నాడు. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఏప్రిల్ 30న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేశారు. అందుకు త‌గిన‌ట్లు సినిమాను ఇత‌ర భాషా నటీన‌టుల‌తో రూపొందిస్తున్నారు. రానా పాత్ర‌కు సంబంధించిన చిన్న వీడియో ప్రోమో, కోలు కోలు అనే సాంగ్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఈ నేప‌థ్యంలో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప‌రంగా మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని స‌మాచాచారం.

తాజా స‌మాచారం మేర‌కు ప్ర‌ముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ హ‌క్కుల‌ను రు.11 కోట్ల‌కు ద‌క్కించుకుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. రానా సినిమాల్లో ఈ సినిమాకే ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ మొత్తంలో డిజిట‌ల్ హ‌క్కులు వ‌చ్చిన‌ట్లు అని అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz